Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కరోనా రిస్క్ జోన్లు ఇవే... సమూహ వ్యాప్తికి ఛాన్స్!

Webdunia
బుధవారం, 6 మే 2020 (09:30 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ జోరుకు బ్రేకులు పడ్డాయని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా అతి తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో బుధవారం నుంచి ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు అన్ని సడలింపులు ఇచ్చారు. మద్యం షాపులు కూడా తెరిచేందుకు ఆ రాష్ట్రం అనుమతి ఇచ్చింది. కేంద్రం మార్గదర్శకాల మేరకు తెలంగాణాలో అన్ని సంస్థలు, కార్యాలయాలు పని చేయనున్నాయి. 
 
అయితే, తెలంగాణాలో మూడు జిల్లాలు మాత్రం అత్యంత ప్రమాదకారిగా మారినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ జిల్లాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించారు. అందువల్ల ఆ జిల్లాల్లో ఇతరులు వెళ్లరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. పైగా, ఈ జిల్లాల్లో సమూహ వ్యాప్తి (కమ్యూనిటీ స్ప్రెడ్) జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 
 
అలాగే, తెలంగాణాలో నమోదైన మొత్తం 1096 కేసుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లోనే ఏకంగా 726 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మూడు జోన్లలోనే 25 మంది చనిపోయారని గుర్తుచేశారు. అందువల్ల ఈ మూడు జోన్లతో పాటు.. మూడు జిల్లాల్లో కఠినమైన ఆంక్షలు విధించినట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments