Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ పరిస్థితులపై ఏపీ హైకోర్టులో విచారణ.. మెడిసిన్ బ్లాక్ మార్కెట్‌పై..?

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (19:32 IST)
కోవిడ్ పరిస్థితులపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ సర్కారుకు ప్రశ్నాస్త్రాలు సంధించింది. బ్లాక్ ఫంగస్ మెడిసిన్ బ్లాక్ మార్కెట్‌పై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
 
కొవిడ్ పరిస్థితులపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా బ్లాక్ ఫంగస్ మెడిసిన్ బ్లాక్ మార్కెట్ పై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామని ప్రభుత్వం సమాధానం చెప్పింది. బ్లాక్ ఫంగస్ మెడిసిన్ కొరత, అత్యధిక ధరలకు అమ్మకాలపై ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.
 
కేంద్ర ప్రభుత్వం సరిపడా ఇంజక్షన్లు సరఫరా చేయడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇప్పటివరకు 13 వేల ఇంజక్షన్లు ఇచ్చారని ప్రస్తుతం 14 వందల మంది పేషేంట్స్ ఉన్నారన్న ప్రభుత్వం తరపున న్యాయవాదులు వెల్లడించారు. ఒక్కో బ్లాక్ ఫంగస్ పేషేంట్ కి రోజుకి 3 ఇంజక్షన్లను 15 రోజుల పాటు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. బ్లాక్ ఫంగస్ పేషేంట్స్ కోసం 50 వేల ఇంజక్షన్ల అవసరం ఉందని వెల్లడించింది.
 
ప్రైవేట్ ఫార్మా కంపెనీల నుంచి కూడా ప్రభుత్వం కొనుగోలుకి సిద్ధమైందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఏపీకి అవసరాలకు సరిపడా బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారో, ఏ ప్రాతిపదికన రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారో మధ్యాహ్నం నాటికి చెప్పాలని హైకోర్టు సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments