10 రూపాయల డాక్టర్: కరోనావైరస్ హాంఫట్, హైదరాబాదులో ఎక్కడో తెలుసా?

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (09:19 IST)
కరోనా ఇప్పుడు కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులకు కాసులను కురిపిస్తోంది. వైరస్ బారిన పడి ఒక్కసారి ఆసుపత్రి మెట్లెక్కితే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోవాల్సిందేననే టాక్ విపరీతంగా వినిపిస్తోంది. అయితే హైదరాబాద్ నగరంలో మాత్రం ఒక డాక్టర్ కేవలం 10 రూపాయల ఫీజుతో కరోనాకు వైద్యం చేస్తున్నారు. ఆసుపత్రిలో చేరిన కరోనా రోగులకు మొదటి నుంచి చివరి వరకు అయ్యే ఫీజు 15 వేల నుంచి 20 వేల లోపే. మరి ఈ పేదల డాక్టర్ ఇంత చీప్‌గా కరోనా రోగులకు ఎలా సేవ చేయగలుతున్నారో తెలుసా..?
 
హైదరాబాద్ నగరంలోని బోడుపల్ పరిసరాల్లో డాక్టర్ ఇమానుయేల్ ప్రజ్వ ఆసుపత్రిని నడుపుతున్నారు. ఆయన ఎంబిబిఎస్ చేశారు. తరువాత వివిధ ఆసుపత్రులలో పనిచేశారు. కొంతకాలం కిందటే ప్రజ్వ క్లినక్‌ను ఆరంభించారు. ప్రస్తుతం ఆయన తన ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు 10 రూపాయల ఫీజు తీసుకుని వైద్యం అందిస్తున్నారు.
 
ఆయన ఆసుపత్రికి వచ్చేవారు తెల్లరేషన్ కార్డులను కలిగిన నిరుపేదలైతే ఉచితంగానే వైద్యం చేస్తున్నారట. అవసరమైన మందులు, బెడ్‌కి సైతం నామమాత్రపు ఫీజులనే తీసుకుంటున్నారట. ఆర్మీలో పనిచేసే వారికి, దివ్యాంగులు, ప్రత్యేక ప్రతిభావంతులు, పేదలకైతే జబ్బు నయమయ్యేంత వరకు ఉచితంగానే వైద్యం అందిస్తున్నారు. ఆయన మాకు దేవుడు అంటూ చికిత్స తీసుకుని ఆరోగ్యం కుదుటపడినవారు చేతులెత్తి దణ్ణం పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments