Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఎమ్మెల్యే పదవికి - తెరాస పార్టీకి ఈటల రాజీనామా!

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (09:15 IST)
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన మాతృపార్టీ తెలంగాణ రాష్ట్ర సమితో పూర్తిగా తెగదెంపులు చేసుకోనున్నారు. ఇందులో భాగంగా, ఆయన శుక్రవారం తన శాసన సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. తన నివాసంలో నిర్వహించే మీడియా సమావేశంలో ఆయన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన విషయాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈటలతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి, కరీంనగర్‌ మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌, మరికొందరు ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. కొవిడ్‌ దృష్ట్యా ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళ్లే అవకాశం లేదు.
 
ఈటల, మరికొందరు ముఖ్యులు చేరిన తర్వాత.. మిగతా వారు కాషాయ కండువా వేసుకోనున్నారు. గత నెల 30న ఢిల్లీ వెళ్లిన ఈటల, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన సంగతి తెలిసిందే. ఆయనతో సమావేశం అనంతరం, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, సంజయ్‌తో ఈటల ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
 
ఈ సందర్భంగా చేరిక తేదీపై చర్చించినట్లు బీజేపీ వర్గాల సమాచారం. 9, 10, 11 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని, అందుకు అనుగుణంగా సంజయ్‌ ద్వారా జాతీయ అధ్యక్షుడి అపాయింట్‌మెంట్‌ కోరినట్లు సమాచారాం. అన్నీ సక్రమంగా కుదిరితో వచ్చే ఈవారంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లి జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం హార్డ్ వర్క్, టాలెంట్ కు దక్కిన ఫలితమే క విజయం

పాన్ ఇండియా చిత్రాలకు ఆ తమిళ హీరోనే స్ఫూర్తి : ఎస్ఎస్.రాజమౌళి

రెబల్ స్టార్ ప్రభాస్ తో మూడు మెగా సినిమాలు ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్

'అమ్మ'కు ఆఫీస్ బాయ్‌గా కూడా పని చేయను : మోహన్ లాల్

ఇండస్ట్రీలో ఎవ్వరూ ఎవరికీ సపోర్ట్ చేయరని తేల్చి చెప్పిన దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments