Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రైవసీ పాలసీని అప్డేట్ చేసుకోమంటున్న వాట్సాప్.. కేంద్రం ఏమంటుందంటే..?

ప్రైవసీ పాలసీని అప్డేట్ చేసుకోమంటున్న వాట్సాప్.. కేంద్రం ఏమంటుందంటే..?
, గురువారం, 3 జూన్ 2021 (15:32 IST)
ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీగా ఉన్న వాట్సాప్ తన యాప్‌లలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. వినియోగదారులు ఎంతగానో వాట్సాప్ స్టిక్కర్ల కోసం సెర్చ్ చేయడం ఇకనుంచి సులభతరం కానుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా వినియోగదారులకు సెర్చ్ ఫర్ స్టిక్కర్ అనే కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేసి ప్రయోగానికి సిద్ధమైంది. గ్రూప్ వీడియో కాలింగ్ పరిమితిని సైతం పెంచింది. 
 
ఛాట్ బ్యాకప్, ఛాట్ మైగ్రేషన్ టూల్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ వినియోగదారులకు అందించింది. మీరు ఏదైనా కీవర్డ్ టైప్ చేస్తే అందుకు సంబంధించిన స్టిక్కర్లను అందించే ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 2.21.12.1లో వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు తీసుకొచ్చింది. 
 
ఇటీవల ప్లేబ్యాక్స్ స్పీడ్ ఫర్ వాయిస్ మెస్సేజ్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ వినియోగదారులకు, డెస్క్‌టాప్ యూజర్ల కోసం లాంచ్ చేసింది. మరోవైపు వాట్సాప్ ప్రైవసీ పాలసీ (WhatsApp Privacy Policy) అప్‌డేట్ చేసుకోవాలని వినియోగదారులకు నోటిఫికేషన్ డిప్‌ప్లే చేస్తుంది. 
 
ఈ నేపథ్యంలో వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన నూతన గోప్యతా విధానం వల్ల ఏర్పడిన వివాదం ఇప్పట్లో ముగిసేటట్లు కనిపించడం లేదు. నూతన గోప్యతా విషయంలో కేంద్ర ప్రభుత్వం, వాట్సాప్ పోటాపోటీగా ఒకరిపై మరొకరు దిల్లీ హైకోర్టులో అభియోగాలు మోపుకుంటున్నారు. 
 
వినియోగదారులతో నూతన విధానాన్ని ఆమోదింపజేసేందుకు వాట్సాప్ ఉపాయాలు పన్నుతోందని తాజా అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ఇంకా చట్టరూపం దాల్చకముందే నూతన గోప్యతా విధానాలను ఆమోదింపజేసేందుకు ప్రతిరోజూ నోటిఫికేషన్లను పంపించి "బలవంతం" చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.
 
కొత్త గోప్యతకు సంబంధించి ప్రస్తుత వినియోగదారులకు నోటిఫికేషన్లను పంపకుండా ఉండటానికి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వం కోర్టును కోరింది. వివాదాస్పదంగా మారిన గోప్యతా విధానానికి వ్యతిరేకంగా గతంలో వాట్సాప్‌పై పలు కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 
 
అయితే, ఆ సంస్థ మాత్రం తాము చెప్పిన గడువు(మే 15) ప్రకారమే ఈ విధానం అమల్లోకి తీసుకువచ్చినట్లు చెప్పింది. అయితే ఆ నిబంధనలను ఆమోదించని వినియోగదారుల ఖాతాలను తొలగించడం లేదని మాత్రం తెలిపింది. మరోవైపు, ఈ విధానం ఐటీ నిబంధనలు-2011కు అనుగుణంగా లేవని గతంలో కేంద్రం వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరాఖండ్‌లో 2300మది పోలీసులకు సోకిన కరోనా రక్కసి.. 64 మంది మృతి