Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కులు ధరించలేదంటే ఆరు నెలల పాటు జైలు శిక్ష ఎక్కడ..?

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (09:19 IST)
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు మాస్కులు లేకుండా బహిరంగ ప్రాంతాల్లో విచ్చలవిడిగా సంచరిస్తుండడం, బహిరంగసభలు, సమావేశాల్లో పాల్గొంటుండడమే దీనికి కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నీలగిరి కలెక్టర్‌ హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఊటీలో మాస్క్‌ ధరించని వారికి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తామని నీలగిరి జిల్లా కలెక్టర్‌ ఇన్సెంట్‌ దివ్య హెచ్చరించారు. 
 
ఊటీలోని ప్రజలు గానీ, పర్యాటకులు గానీ మాస్కులు ధరించకుండా సంచరిస్తే ఆరు నెలల జైలుశిక్ష విధిస్తామన్నారు. మాస్కులు లేకుండా సంచరించే వారిని గుర్తించేందుకు 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. మాస్కులు ధరించనివారి నుంచి ఇప్పటి వరకూ రూ.30.68 లక్షల జరిమానా వసూలు చేశామన్నారు. 
 
కాగా, మాస్కు ధరించని వారికి ఆరు నెలల జైలుతోపాటు రూ.200 జరిమానా కూడా విధిస్తామని జిల్లా అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఏపీ, పుదుచ్చేరి, కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల నుంచి తమిళనాడు వచ్చేవారు తప్పనిసరిగా ఈపాస్‌ తీసుకోవాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments