Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారెంటింగ్ టిప్స్: పిల్లలతో అలా గడపండి.. రూల్స్ పెట్టకండి..

పిల్లలు ఎదిగేకొద్దీ లోకమేమిటో అర్థమయ్యేలా చెప్పాలి. గందరగోళంతో పిల్లలకు వివరాలు చెప్పకూడదు. పిల్లలకు అర్థమయ్యే భాషలో వారికి మంచి చెడు చెప్పాలి. పిల్లలను స్వేచ్ఛగా పెంచాలి. వారిని పదే పదే నియంత్రించకూడ

Webdunia
బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (10:07 IST)
పిల్లలు ఎదిగేకొద్దీ లోకమేమిటో అర్థమయ్యేలా చెప్పాలి. గందరగోళంతో పిల్లలకు వివరాలు చెప్పకూడదు. పిల్లలకు అర్థమయ్యే భాషలో వారికి మంచి చెడు చెప్పాలి. పిల్లలను స్వేచ్ఛగా పెంచాలి. వారిని పదే పదే నియంత్రించకూడదు. మానసిక పరంగా వారిని ప్రోత్సహించాలి. వారి బుద్ధిని పెంచే బొమ్మలు తీసిపెట్టాలి. స్కూలుకు వెళ్లక ముందే చదువుపై ఆసక్తి కలిగేలా చేయాలి. 
 
శిక్షించడంలో కఠినత్వం ఉండకూడదు. ఏది తప్పో, ఏది కరెక్టో చెప్పాలి. ఫ్యాషన్, విజ్ఞానం, టెక్నాలజీ పరంగా వారికి సూచనలు ఇవ్వాలి. చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు పిల్లలకు మార్గదర్శకంగా ఉండాలి. పిల్లలతో కలిసి ఆడుతూ పాడుతూ ఉండండి. రూల్స్ పెట్టకండి. శుభ్రత గురించి చెప్పండి. ఆడుకున్నాక వారి బొమ్మల్ని వారే తీసి బాక్స్‌లో వేసేలా చేయండి. టాయ్స్‌ను శుభ్రంగా ఉంచుకోండి. 
 
తల్లిదండ్రులపై పిల్లలకు నమ్మకం కలిగేలా చేయాలి. వారికి మీరు ఆదర్శప్రాయం కావాలి. ఆహారం- ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. తప్పుల్ని ఎత్తిచూపేటప్పుడు వారు అర్థం చేసుకునేలా చెప్పాలి. స్కూలు నుంచి ఇంటికి వచ్చాక వారే స్కూలు విషయాలను చెప్పేలా చూడాలి. తల్లిదండ్రులంటే భయపడకుండా.. స్నేహంగా ఉండేలా పెంచాలి. అందుకు మీరు మీ పిల్లల స్నేహితులుగా మారాలి.
 
పోషకారం ఇవ్వాలి. డైట్‌లో కూరగాయలు, ఆకుకూరలు, నట్స్ ఉండేలా చూడాలి. మాంసాహారం వారానికోసారి, కోడిగుడ్డు రోజుకొకటి ఇవ్వాలి. పిల్లల ఆహారంలో కొవ్వు లేకుండా చూసుకోవాలి. చేసిన తప్పును అంగీకరించేలా పిల్లలు పెంచాలి. తల్లిదండ్రులంటే అమితమైన గౌరవం ఉండేలా.. స్నేహభావంతో వారి కష్టనష్టాలను తెలుసుకోవాలి. పిల్లల ఫ్రెండ్స్ గురించి తెలుసుకోవాలి. 
 
రోజూ మూడు ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్‌పై అడగండి. సామాజిక, మానసిక, సాంకేతిక విభాగాలతో పాటు వారికి ఆసక్తి గల రంగాల్లో వారి రాటు తేలేలా చేయాలి. ప్రశ్నలకు ఆన్సర్లు కూడా ఇవ్వాలని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

తర్వాతి కథనం
Show comments