పిల్లలు చిన్న పని చేసినా క్లాప్స్‌తో ప్రోత్సహిస్తున్నారా?
చిన్న పని చేసినా పిల్లలను క్లాప్స్‌తో ప్రోత్సహించండి. ఇలా చేస్తే వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందుతుంది. అప్పుడే పిల్లల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది. పిల్లలతో మాట్లాడేటప్పుడు కోపాన్ని పక్కనబెట్ట
చిన్న పని చేసినా పిల్లలను క్లాప్స్‌తో ప్రోత్సహించండి. ఇలా చేస్తే వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందుతుంది. అప్పుడే పిల్లల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది. పిల్లలతో మాట్లాడేటప్పుడు కోపాన్ని పక్కనబెట్టాలి. తిట్టడం, కొట్టడం చేయకూడదు. పిల్లల ఎదుగుదలకు ఆర్థికంగా నిలదొక్కుకుని.. డబ్బు ఆవశ్యకతను కూడా వారికి తెలియజేయాలి. ఆర్థిక ఇబ్బందులతో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలో వారికి తెలియజేయాలి.
పిల్లల గురించి ఇతరులు చాడీలు చెప్పినా.. పిల్లలతో నేరుగా మాట్లాడి సమస్యను పరిష్కరించాలి. ఇతరుల మాటలను నమ్మి పిల్లలపై చిర్రుబుర్రులాడటం చేయకూడదు. ఇంట్లోని పెద్దలతో పిల్లల ఆడుకునేలా చేయండి. వారు చేసే ప్రతి విషయాన్ని ప్రోత్సహించండి. బొమ్మలతో, ఇంట్లోని పెద్దలతో ఆడుకునేలా చూడాలి. ఫోన్లు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను దూరంగా ఉంచాలి.
స్కూలు నుంచి వచ్చాక అరగంట పాటు పిల్లల్లి ఫ్రీగా వదలాలి. ఆ తర్వాత స్కూలు సంగతులేంటని అడిగి తెలుసుకోవాలి. ఇలా చేయడం ద్వారా పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవచ్చు. తల్లిదండ్రులపై పిల్లలకు నమ్మకం కలిగేలా చేయాలి. వారికి మీరు ఆదర్శప్రాయం కావాలి. ఆహారం- ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. తప్పుల్ని ఎత్తిచూపేటప్పుడు వారు అర్థం చేసుకునేలా చెప్పాలి.
స్కూలు నుంచి ఇంటికి వచ్చాక వారే స్కూలు విషయాలను చెప్పేలా చూడాలి. తల్లిదండ్రులంటే భయపడకుండా.. స్నేహంగా ఉండేలా పెంచాలి. అందుకు మీరు మీ పిల్లల స్నేహితులుగా మారాలి. పోషకారం ఇవ్వాలి. డైట్‌లో కూరగాయలు, ఆకుకూరలు, నట్స్ ఉండేలా చూడాలి. మాంసాహారం వారానికోసారి, కోడిగుడ్డు రోజుకొకటి ఇవ్వాలి. పిల్లల ఆహారంలో కొవ్వు లేకుండా చూసుకోవాలి.
చేసిన తప్పును అంగీకరించేలా పిల్లలు పెంచాలి. తల్లిదండ్రులంటే అమితమైన గౌరవం ఉండేలా.. స్నేహభావంతో వారి కష్టనష్టాలను తెలుసుకోవాలి. పిల్లల ఫ్రెండ్స్ గురించి తెలుసుకోవాలి. రోజూ మూడు ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్‌పై అడగండి. సామాజిక, మానసిక, సాంకేతిక విభాగాలతో పాటు వారికి ఆసక్తి గల రంగాల్లో వారి రాటు తేలేలా చేయాలని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.