Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మాయిలను తరలించడంలో.. ఆ గృహాల నిర్వహణలో ఏపీ టాప్

అక్రమంగా అమ్మాయిలను తరలించడంతో ఆంధ్రప్రదేశ్ ముందుంది. ఇంకా వ్యభిచార గృహాల నిర్వహణలోనూ ఏపీ ఇతర రాష్ట్రాల కంటే ముందున్నట్లు తాజా నివేదికలో వెల్లడి అయ్యింది. మహిళలకు రక్షణ ఇవ్వడంపై ఏపీ సర్కారు కఠిన చర్యల

అమ్మాయిలను తరలించడంలో.. ఆ గృహాల నిర్వహణలో ఏపీ టాప్
, మంగళవారం, 16 జనవరి 2018 (10:07 IST)
అక్రమంగా అమ్మాయిలను తరలించడంతో ఆంధ్రప్రదేశ్ ముందుంది. ఇంకా వ్యభిచార గృహాల నిర్వహణలోనూ ఏపీ ఇతర రాష్ట్రాల కంటే ముందున్నట్లు తాజా నివేదికలో వెల్లడి అయ్యింది. మహిళలకు రక్షణ ఇవ్వడంపై ఏపీ సర్కారు కఠిన చర్యలు ప్రారంభించినప్పటికీ.. పట్టుబడిన వారు శిక్షల నుంచి తప్పించుకుని తిరుగుతూ.. మళ్లీ అదే పనిలో నిమగ్నమవుతున్నారు.

దీంతో ఇలాంటి నేరాలు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. మనదేశంలో 2 కోట్ల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్టు అంచనా. వీరిలో కేవలం 40 లక్షల మందే స్వచ్ఛంద్ధంగా వృత్తిలోకి వచ్చారని, మిగతా 1.6 కోట్ల మంది హ్యూమన్ ట్రాఫికింగ్‌లో భాగమైన మహిళలు, బాలికలేనని తేలింది. 
 
ఇకపోతే.. యాంట్రీ ట్రాఫికింగ్ చట్టాలపై అధ్యయనం కోసం న్యాయ నిపుణులతో ఏపీ సర్కారు ఓ కమిటీని ఏర్పాటు చేయగా, ఈ కమిటీ రెండు నెలల్లో రిపోర్టును ఇవ్వాల్సివుంది.

ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్‌ గురించి మాట్లాడిన కమిటీ సభ్యురాలు సునీతా కృష్ణన్, వ్యభిచారం నిర్వహించేవారు, వ్యభిచార గృహాలు నిర్వహించే వ్యక్తులకు ఈ చట్టం కఠిన శిక్షలు విధిస్తుందని తెలిపారు. బాలికలను కొనేవారు అధికమవుతున్నారని.. తద్వారా అమ్మేవారు కూడా పుట్టుకొస్తూనే వున్నారని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువతిని కిడ్నాప్ చేసి.. కారులో తిప్పుతూ అత్యాచారం...