Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబిషన్ ఆఫీసర్స్ రాత పరీక్షల ఫలితాలు వెల్లడి

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (16:05 IST)
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న భారత స్టేట్ బ్యాంకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పొరబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను తాజాగా వెల్లడించింది. మొత్తం 1673 పోస్టుల పీవో పోస్టుల భర్తీ కోసం ఈ రాత పరీక్షను నిర్వహించారు. తొలుత నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి జనవరి 30వ తేదీన మెయిన్స్ పరీక్షలను నిర్వహించారు. ఆ తర్వాత ఫేజ్-3లో భాగంగా గ్రూపు ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూలను ఏప్రిల్‌లో నిర్వహించి షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల తుది జాబితాను సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రొమోషన్ విభాగం మంగళవారం వెల్లడించింది. 
 
గత యేడాది సెప్టెంబరు నెలలో ఎస్.బి.ఐ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 1673 పోస్టులకు గాను 1600 రెగ్యులర్ పోస్టులు కాగా, 73 బ్యాక్‌లాగ్ ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులను మొత్తం మూడు దశల్లో ఎంపిక చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్షలను జనవరి నెల నాటికే పూర్తి చేయగా, మూడో దశ పరీక్షల్లో భాగంగా గ్రూపు ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూలను పూర్తి చేసి తాజాగా తుది జాబితాను రిలీజ్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments