Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెటా నుంచి మరో 10 వేల మందికి ఉద్యోగులపై వేటు?

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (14:32 IST)
అంతర్జాతీయంగా ఆర్థిక రంగంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అనేక పేరు మోసిన టెక్ కంపెనీలు ముందస్తు చర్యల్లో భాగంగా, అనేక మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే పలు టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇపుడు మరోమారు తొలగింపునకు రంగం  సిద్ధం చేస్తున్నాయి. ఇందులోభాగంగా ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా మరింత మంది ఉద్యోగులను తీసివేయనున్నట్టు ప్రకటించింది. 
 
అమెరికా కాలమానం ప్రకారం బుధవారం అధికారికంగా దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వ్యయ నియంత్రణలో భాగంగా దాదాపు మరో 10,000 మందిని తొలగించాలని మెటా నిర్ణయించినట్లు వినికిడి. మెటా పరిధిలో ఉన్న ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వర్చువల్‌ రియాలిటీపై పనిచేస్తున్న రియాలిటీ ల్యాబ్‌.. ఇలా అన్ని వ్యాపారాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ మేరకు ఇప్పటికే మేనేజర్లకు అంతర్గతంగా సమాచారం పంపినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మార్చిలోనే సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ దీనిపై సంకేతాలిచ్చారు. అన్ని విభాగాల్లో సిబ్బంది కూర్పును పునఃసమీక్షించి కంపెనీ సామర్థ్యాన్ని మరింత పెంచాలనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అందుకనుగుణంగానే తాజాగా లేఆఫ్‌లకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. మే నెలలో మరికొంత మందిని కూడా తీసివేసే అవకాశం ఉందని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments