టీమిండియా మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నిన్నటికి నిన్న గంగూలీకి కరచాలనం ఇచ్చేందుకు కూడా కోహ్లీ ఇష్టపడలేదు. గంగూలీతో చేతులు కలిపేందుకు కోహ్లీ నిరాకరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	తాజాగా ఇన్‌స్టాలో సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీలు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఢిల్లీతో మ్యాచ్ అనంతరం గంగూలీని కోహ్లీ అన్-ఫాలో చేయగా గంగూలీ కూడా అదే తరహాలో కోహ్లీని అన్ ఫాలో చేశాడు. 
 
									
										
								
																	
	 
	ఇన్ స్టాలో గంగూలీకి 3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉండగా, 106 మందిని అనుసరిస్తున్నాడు. కోహ్లీకి 246 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉండగా, 276 మందిని అనుసరిస్తున్నాడు.