వెట్రిమారన్ తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు మరియు తెలుగులో అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆడుకాలం, అసురన్, వడ చెన్నై వంటి కల్ట్ చిత్రాలను అందించారు. ఈ దర్శకుడి విడుతలై సినిమా తెలుగులో "విడుదల పార్ట్ 1" తొలిసారి విడుదలై అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
విడుదల పార్ట్ 1 పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి మంచి సమీక్షలను పొందింది. వెట్రిమారన్ ఈ రా స్టోరీని అద్భుతమైన సన్నివేశలతో అద్భుతంగా తెరకెక్కించాడు. యాక్షన్ సీన్స్ రియలిస్టిక్ గా అనిపించాయి. రైలు ప్రమాద సన్నివేశం మొత్తం సినిమాకి హైలెట్ అని చెప్పొచ్చు.
కథ: 1980లో కథ. తమిళనాడులోని ఓ గ్రామంలో ఖనిజాలు ఉంటాయి. వాటిని ప్రభుత్యము ప్రైవేట్ వారికి అప్పగిస్తుంది. ఎదురుతిరిగితే ఆ గ్రామస్థులను పోలీస్ బలగంతో దాడిచేస్తుంది. అక్కడి వారిని ఎడ్యుకేట్ చేసి మా ఊరులోని ఖనిజాలు మా హక్కు అని ఎలుగెత్తి చాటిన విజయసేతుపతికి నక్సలైట్ ముద్రపడింది. అప్పుడు స్పెషల్ పోలీస్ కంపెనీ విజయసేతుపతి కోసం వేటాడుతుంది. ఆ సమయంలో కొత్తగా పోలీసు డ్యూటీకి సూరి వస్తాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మిగిలిన సినిమా.
విశ్లేషణ: ప్రతి పాత్ర వెనుక వెట్రిమారన్ చేసిన కృషి తెరపై కనిపిస్తుంది. అతని అసలైన మరియు గ్రామీణ చిత్ర నిర్మాణ శైలి అందరిని సప్రైజ్ చేసింది. ఈ సినిమాలో సమాజాన్ని ప్రశ్నించే సామాజిక సందేశం మరియు సాధారణ ప్రజలు వ్యవస్థ యొక్క మరొక వైపు కూడా చూసేలా చేస్తుంది. సూరి, విజయ్ సేతుపతి మరియు భవానీ శ్రీల నటన కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
ఈ కథ భారత్ కథ. అన్ని చోట్ల ఖనిజాలకోసం ప్రభుత్యాలు ప్రజలని మోసంచేసి ప్రైవేట్ పరం చేస్తున్నాయి. ఈ కోణంలో తెలుగులో సినిమాలు వచ్చినా ఇంత లోతుగా తీయలేకపోయారు. పోలీస్ కంపెనీ అధికారి నిరంకుశం, శాడిజం, ఖరుకుతనం గతంలో రజాకార్ల ఉద్యమాన్ని తపిస్తుంది. ఏవి కాళ్లకు కట్టినట్లు చూపించడం చిత్రంలో హైలెట్. ఈ సినిమా అందరూ చూడాల్సిన సినిమా.
వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ తప్పక చూడాలి. త్వరలో స్ట్రెయిట్ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు వెట్రిమారన్. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ మరియు గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్లపై ఎల్రెడ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ఆర్. వేల్రాజ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసారు. లెజెండరీ సంగీత విద్వాంసులు మాస్ట్రో ఇళయరాజా చిత్ర సౌండ్‌ట్రాక్‌ను సమకూర్చారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు.