#JEEMainsExams : నాలుగో విడత షెడ్యూల్‌లో మార్పులు

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (11:14 IST)
జేఈఈ మెయిన్స్ నాలుగో విడత పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. షెడ్యూల్ ప్రకారం నాలుగో విడత పరీక్షలు ఆగస్టు 26, 27, 31 తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలను సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నిర్వహించబోతున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అదేసమయంలో నాలుగో విడత పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును కూడా ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్టు చెప్పారు. 
 
నాలుగో విడత జేఈఈ మెయిన్స్ పరీక్షలకు ఇప్పటికే 7.32 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, కరోనా వైరస్ రెండో దస వ్యాప్తి కారణంగా అనేక మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. 
 
దీంతో విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్లను దృష్టిలో ఉంచుకునే ఈ మార్పులు చేసినట్టు మంత్రి తెలిపారు. జేఈఈ మెయిన్స్ మూడు, నాలుగో విడత పరీక్షలకు మధ్య నాలుగు వారాల వ్యవధి ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీకి సూచించామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments