ఏపీ పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలో వింత ప్రశ్నలు

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (12:46 IST)
రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి ప్రీఫైనల్ పరీక్ష పశ్నపత్రంలో వింత ప్రశ్నలు వచ్చాయి. హిందీ, ఇంగ్లీష్ ప్రశ్నపత్రాల్లో అమ్మ ఒడి పథకంపై ప్రశ్నలు అడగటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అమ్మ ఒడి పథకం అమలు తీరును వివరిస్తూ చెన్నైలో ఉండే మీ ఫ్రెండ్‌కి లేఖ రాయాలంటూ పరీక్ష ప్రశ్న వచ్చింది. మొదటి ప్రశ్నగా అమ్మ ఒడి పథకం కింద ఎంతమంది లబ్ధిదారులున్నారు? అర్హత నిబంధనలు, కొత్త పథకం అమలు తీరు ఎలా జరుగుతుందనే అంశాలపై లేఖ రాయాలంటూ పేర్కొన్నారు. 
 
ఈ ప్రశ్నకు ఎస్ఎస్‌సీ బోర్డు 5 మార్కులిచ్చింది. పరీక్ష పత్రంలోని సెక్షన్ 'C'లోనే అమ్మ ఒడి పథకంపై రెండు ప్రశ్నలు ఇచ్చారు. మరో ప్రశ్నగా ఓ దినపత్రిక స్పెషల్ కరస్పాండెంట్‌గా ఊహించుకొంటూ మీ స్కూల్‌లో అమ్మఒడి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వార్తా కథనంగా రాయాలని అడిగారు. ఈ రెండు ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్నకు సమాధానం రాయాలని పేర్కొన్నారు. 
 
హిందీ, ఇంగ్లీష్ ప్రశ్న పత్రాల్లో సృజనాత్మక వ్యక్తీకరణ విభాగం కింద అమ్మ ఒడి పథకంపై ప్రశ్నలు ఇచ్చారు. అయితే రెండు ఛాయిస్‌ల్లోనూ ఒకే పథకంపై ప్రశ్నలు రావడంతో వీటిల్లో ఏదో ఒకదానికి సమాధానం రాయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాగా, ప్రీఫైనల్ పరీక్షలో ఇలాంటి ప్రశ్నలు రావటం సర్వత్రా చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments