Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెలాఖరుకల్లా స్థానిక ఎన్నికలు?

Advertiesment
Local body elections
, సోమవారం, 2 మార్చి 2020 (04:32 IST)
ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలాఖరుకల్లా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఒకవేళ ఈ నెలాఖరులోపు స్థానిక ఎన్నికలు పూర్తి కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 14 ఆర్ధిక సంఘం నుంచి రావాలిసిన నిధులకు బ్రేక్ పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వంలో టెన్షన్ నెలకొంది.

కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన 59 శాతం రిజర్వేషన్ అంశంపై హైకోర్టు రిజర్వ్ చేసి ఉండటంతో ఆ విషయంలో క్లారిటీ రాగానే వెంటనే ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

హైకోర్టు రిజర్వేషన్లపై ఏ విధమైన తీర్పు బట్టి దానికి అనుగుణంగా తక్షణ ఎన్నికలకు ఈసి కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఏపీ లోని పంచాయితీలు, మునిసిపాలిటీ, కార్పొరేషన్ లకు సంబంధించి అన్ని లెక్కలతో అధికార యంత్రాంగం సమాయత్తం అయ్యింది. 
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితి దినదినగండంగానే నడుస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే 14 ఆర్ధిక సంఘం విడుదల చేసే 3 వేలకోట్ల రూపాయలకు పైబడి నిధులు వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఉండటంతో ఏపీ ప్రభుత్వంలో టెన్షన్ నెలకొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#KhushiyanUnlocked ఇల్లు కొనాలనుకుంటున్నారా?.. ఎస్‌బీఐ ఆఫర్