Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగని పెట్రో - డీజిల్ బాదుడు.. రోజురోజుకూ పైపైకి...

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (09:56 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు ఆగడం లేదు. ఈ ధరలు రోజురోజూకూ పైపైకి పోతున్నాయి. ఇప్పటికే ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకున్న ధరలు మరింత పైకి వెళ్తున్నాయి. తాజాగా మంగళవారం చమురు కంపెనీలు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 31 పైసలు వరకు పెంచాయి. 
 
ఈ తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.98.81, డీజిల్‌ లీటర్‌ రూ.89.18కు పెరిగింది. గత నెల నుంచి ఇప్పటి వరకు 33 సార్లు లీటర్‌ పెట్రోల్‌పై రూ.8.49, డీజిల్‌పై రూ.8.39 పెరిగింది. చెన్నైలో పెట్రోల్‌ రూ.99.80.. డీజిల్‌ రూ.93.72గా ఉంది. 
 
మరో వైపు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో పెట్రోల్‌ రూ.105 వైపు పరుగులు పెడుతున్నది. ప్రస్తుతం లీటర్‌ ధర రూ.104.90 పలుకుతోంది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలతో సామాన్యులు బంకులకు వెళ్లాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. 
 
అలాగే, తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల పరిధిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను దాటగా.. డీజిల్‌ ధర రూ.100 వైపు పరుగులు పెడుతున్నది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.102.69.. డీజిల్‌ రూ.97.20, విజయవాడలో పెట్రోల్‌ రూ.104.58, డీజిల్‌ రూ.98.52 చొప్పున ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments