తెలంగాణా రాష్ట్రంలో ఇంటర్ రెండో సంవత్సర పరీక్షా ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఈ పరీక్షా ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులు తిరిగి పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఇంటర్ బోర్డ్ ఇప్పటికే ప్రకటించింది.
28న తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫస్టియర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులు కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు.
ఇప్పటికే మార్కులకు సంబంధించిన మార్గ దర్శకాలను సర్కారు విడుదల చేసింది. ప్రాక్టికల్ పరీక్షలకు 100 శాతం మార్కులు, ఫస్టియర్‌లో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు ఈ ఏడాది 35 శాతం మార్కులు కేటాయించి పాస్ చేయనున్నారు.
అభ్యర్థులు ఫలితాలను https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అయితే.. ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులు తిరిగి పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపిన విషయం విధితమే.