Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

28-06-2021 సోమవారం దినఫలాలు - శంఖరుడిని పూజించినా...

Advertiesment
Daily Horoscope
, సోమవారం, 28 జూన్ 2021 (04:00 IST)
మేషం : స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. ప్రముఖుల కోసం వేచియుండక తప్పదు బ్యాంకు వ్యవహారాలు వాయిదాపడటం మంచిదని గమనించండి. వృత్తి వ్యాపారాల్లో మొహమ్మాటాలు, ఒత్తిళ్ళకు తావివ్వొద్దు. తల, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు అధికమవుతాయి. 
 
వృషభం : ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఫలిస్తాయి. మనోధైర్యంతో ఎంతటి కార్యాన్నైనా సాధించగలుగుతారు. సాంఘీక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగును. ప్రేమికులకు పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఇతరాత్రా చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. 
 
మిథునం : స్థిరాస్తిని అమ్మడానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. సినిమా, కళా రంగాల్లో వారికి ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. గతంలో దొర్లిన పొరపాట్లు పునరావృత్తంకాకుండా జాగ్రత్తపడండి. రాజకీయాలలోని వారికి సంఘంలో స్థాయి పెరుగుతుంది. 
 
కర్కాటకం : కాంట్రాక్టుదారులకు ఆందోళనలు కొన్ని సందర్భములందు ధన నష్టము సంభవించును. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి అభద్రతాభావం, ఆందోళనలకు గురవుతారు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. ప్రయాణాలు, బ్యాంకింగ్ పనులలో అప్రమత్తంగా మెలగండి. 
 
సింహం : ప్రత్తి, పొగాకు, స్టాకిస్టులకు చికాకులు ఎదుర్కొంటారు. మీరెంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులకు కొత్త వాతావరణం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. 
 
కన్య : ముఖ్యుల రాకపోకలు, అనుకోని ఖర్చుల వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకెంతో శుభం చేకూరుతుందని గమనించండి. కుటుంబంలో ఒక శుభకార్యం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
తుల : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. సభలు, సమావేశాల్లో మీ ప్రసంగాలు పలువురిని ఆకట్టుకుంటాయి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి, చికాకులు అధికం. దీర్ఘకాలంగా వాయిదాపడుతున్న పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. స్త్రీలకు మిత్రుల ధోరణి ఎంతో ఆందోళన కలిగిస్తుంది. 
 
వృశ్చికం : అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విజయం సాధించిన రోజు దూరమైన వారు తప్పక మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. పీచు, ఫోం, లెదర్, వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. భార్య భర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం చికాకులను ఎదుర్కొంటారు. 
 
ధనస్సు : ఫ్యాన్సీ, వస్తు, వస్త్ర వ్యాపారస్తులకు చికాకు తప్పదు. సాహిత్య రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయాలే మేలు. విద్యుత్, ఏసీ, కూలర్ మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. నిరుద్యోగులకు సదావకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. 
 
మకరం : వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పనిభారం అధికం. పెద్దలు, అయినవారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు సంపాదన, ఉద్యోగం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్య, ప్రయాసలు ఎదుర్కొంటారు. 
 
కుంభం : నరాలు, తల, ఎముకలకి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగి పురోభివృద్ధి సాధిస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు త్వరలో అనుకూలిస్తాయి. స్త్రీలకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయాలలోని వారు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మీనం : విలువైన పత్రాలు, చేజారిపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. వాహన చోదకులకు మెళకువ అవసరం. ఊహించని ఖర్చులు అధికమవుతాయి. పెద్దలతో వాదోపవాదాలకు దిగవద్దు. సన్నిహితులతో కలిసి సభలు, సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. తొందరపాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

27-06-2021 ఆదివారం దినఫలాలు - ఇష్టదైవాన్ని ఆరాధించినా....