Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

23-06-2021 బుధవారం దినఫలాలు - సత్యదేవుని పూజించిన అర్చించినా...

Advertiesment
23-06-2021 బుధవారం దినఫలాలు - సత్యదేవుని పూజించిన అర్చించినా...
, బుధవారం, 23 జూన్ 2021 (04:00 IST)
మేషం : ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. స్త్రీల ఆరోరగ్యం కుదుటపడుతుంది. మిత్రులు కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. నిరుద్యోగులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. 
 
వృషభం : బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. ఖర్చులు, ఇతర అవసరాలు మెండుగా ఉంటాయి. కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. మీ తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. స్త్రీలకు ఆరోగ్యం సంతృప్తి. 
 
మిథునం : పెద్దల ఆరోగ్యం విషయంలో మెళకువ వహించండి. శారీరకపటుత్వం నెలకొంటాయి. పత్రికా, వార్తా సంస్థలలోని వారు ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ఏదో ఒక పొరపాటు జరిగే ఆస్కారం ఉంది. కొంతమంది మీ సరసపు వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించే ఆస్కారం వుంది. ఖర్చులు అధికంగానే ఉంటాయి. 
 
కర్కాటకం : పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వస్త్ర, బంగారం, పచారీ, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఒక్కసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. 
 
సింహం : ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విద్యార్థులు కొన్ని నిర్బంధాలకు లోనవుతారు. కీలకమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఏసీ, కూలర్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. 
 
కన్య : వృత్తి ఉద్యోగాలు, ఉపాధి పథకాలు ప్రశాంతంగా సాగుతాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. శత్రువులు మిత్రులుగా మారుతారు. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. గృహమునకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు నూతన ఉత్సాహం కానవస్తుంది. 
 
తుల : కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి కానవస్తుంది. వైద్యులు ఆపరేషన్లను చేయునపుడు మెళకువ ఏకాగ్రత అవసరం. ప్రభుత్వ ఉద్యోగులకు పనిలో ఒత్తిడి, చికాకులు అధికం. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్కి అధికమవుతుంది. ఉత్తర, ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. 
 
వృశ్చికం : కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలలో ఉల్లాసంగా గడుపుతారు. ఊహించని ఖర్చులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. విందులలో పరిమితి పాటించండి. 
 
ధనస్సు : స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. అవివాహితులకు త్వరలోనే దూర ప్రాంతాల నుంచి సంబంధాలు ఖాయమవుతాయి. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. మీ కళత్ర మొండివైఖరి వల్ల కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. ఖర్చులు అధికం అయినా ప్రయోజనకరంగా ఉంటాయి. 
 
మకరం : మత్స్యు కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వాతావరణంలోని మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. దంపతుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరీ, సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. 
 
కుంభం : ఉద్యోగస్తులు నూతన పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండటం శ్రేయస్కరం. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రావలసిన ధనం అందినా దానికి తగ్గట్టుగానే ఖర్చులు ఉంటాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 
 
మీనం : ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఖర్చులు అదుపుకాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. విలువైన పత్రాలు చేజారిపోయే ఆస్కారం వుంది. జాగ్రత్త వహించండి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ఆలయాలను సందర్శిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేతి అన్నాన్ని శివునికి నైవేద్యంగా పెడితే..?