Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18-06-2021 - శుక్రవారం మీ రాశి ఫలితాలు- ఇష్ట కామేశ్వరి దేవిని..?

Advertiesment
18-06-2021 - శుక్రవారం మీ రాశి ఫలితాలు- ఇష్ట కామేశ్వరి దేవిని..?
, శుక్రవారం, 18 జూన్ 2021 (05:01 IST)
ఇష్టకామేశ్వరి దేవిని పూజించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం : వార్తా సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. పాత రుణాలు తీర్చడంతో పాటు వస్తువులు విడిపిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి వుండాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. ప్రదేశ సందర్శనలు, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. 
 
వృషభం: ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. పెద్దలు, అయిన వారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఒక యత్నం ఫలించడంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఏజెంట్లు, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి చికాకులు తప్పవు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవచ్చును. 
 
మిథునం: బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. జాయింట్ వ్యాపారాలు, ఉమ్మడి వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నరాలు, తల, ఎముకలకు సంబంధించిన సమస్యలు తప్పవు. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. స్త్రీలకు షాపింగ్‌లోను, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ప్రధానం. 
 
కర్కాటకం: రావలసిన ధనం కోసం శ్రమ, ప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు క్షేమం కాదు. 
 
సింహం: వృత్తి వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కుంటారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. మిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలనే పట్టుదల అధికమవుతుంది. 
 
కన్య: బ్యాంకు వ్యవహారాల్లో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. బంధువుల కోసం ధనం విరివిగా వ్యయం చేయాల్సి వస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
 
తుల: బ్యాంకింగ్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కొంటారు. హామీలకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన అవసరం. కళలు, క్రీడల వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
వృశ్చికం : బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఎల్ఐసీ, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల ధనం అందుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని పనులు వాయిదా పడవచ్చు. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. ఏజెంట్లు,  రిప్రజెంటేటివ్‌లకు సదవకాశాలు లభిస్తాయి. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.  
 
ధనస్సు: రవాణా, ప్రకటనలు, బోధన, స్టేషనరీ, విద్యారంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. శాస్త్ర, సాంకేతిక, కళ, క్రీడా రంగాల వారికి అనుకూలం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు. 
 
మకరం: రాజకీయ రంగాల వారికి కొంత అనుకూలిస్తుంది. గృహోపకరణాల వస్తువుల కొనుగోలు కోసం షాపింగ్ చేస్తారు. ఎసీ, కూలర్ మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం తగ్గుతుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. 
 
కుంభం: ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఏది జరిగినా మంచికేనని భావించండి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. 
 
మీనం: రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టం మీద పూర్తి చేస్తారు. చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. మిమ్ములను తప్పుదారి పట్టించి లబ్ధిపొందాలని యత్నిస్తారు. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు ప్రలోభాలకు దూరంగా వుండటం మంచిది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శన ఫలాలు.. 12 శివలింగాలను దర్శించుకుంటే..?