Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14-06-2021 సోమవారం దినఫలాలు - అదనపు సంపాదన కోసం...

Advertiesment
14-06-2021 సోమవారం దినఫలాలు - అదనపు సంపాదన కోసం...
, సోమవారం, 14 జూన్ 2021 (04:00 IST)
మేషం : విదేశీయ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్రింటింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయ. వైద్య, ఇంజనీరింగ్, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. సోదరుల నుంచి ఊహించని సమస్యలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. 
 
వృషభం : స్త్రీల పట్టుదల, మొండివైఖరి సమస్యలకు దారితీస్తుంది. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. బంధువుత్వాల మధ్య ఏర్పడిన సందిగ్ధ పరిస్థితులు తీరిపోతాయి. మంచికిపోతే చెడు ఎదురయ్యే పరిస్థితులు ఎదుర్కొంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. 
 
మిథునం : ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదాబపడతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి. ఉపాధ్యాయులకు ఊహించని వారి నుంచి అవకాశాలు లభిస్తాయి. 
 
కర్కాటకం : మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. స్త్రీలకు ఆరోగ్యం విషయంలో ఏమరుపాటు, అశ్రద్ధకూడదు. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తిచేస్తారు. పొదుపు పథకాలు, స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. 
 
సింహం : బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. మీ శ్రీమతి మొండివైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పెద్దలతో వాదోపవాదాలు దిగవద్దు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. 
 
కన్య : ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి, వేధింపులు అధికంగా ఉంటాయి. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి. బేకరీ, స్వీట్స్, తినుబండారాల వ్యాపారులకు తయారీదారులకు ఒత్తిడి పెరుగుతుంది. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. 
 
తుల : దైవ, సేవా సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన దంపతుల మధ్య అవగాహన, ప్రేమాభిమానాలు చోటుచేసుకుంటాయి. మీరాక బంధు మిత్రులకు ఆనందాశ్చర్యాలు కలిగిస్తుంది. ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు పని, శ్రమ, ఒత్తిడి, అధికం. మీ కుటుంబీకుల ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. 
 
వృశ్చికం : బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి చికాకులు తప్పవు. నూతన వాతావరణం, పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలలో అసౌకర్యానికి గురవుతారు. ఏ వ్యక్తికీ పూర్తి బాధ్యతలు అప్పగించడం మంచిదికాదు. స్త్రీలకు షాపింగ్‌లోనూ, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. 
 
ధనస్సు : నూనె, పసుపు, చింతపండు, స్టాకిస్టులకు, రిటైల్ వ్యాపారులకు లాభదాయకం. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. స్త్రీలకు కళ్లు, తల, నరాలు, నడుముకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. సభలు, సమావేశాల్లో మీ ప్రసంగాలు పలువురిని ఆకట్టుకుంటాయి. 
 
మకరం : ఉద్యోగస్తులు వాహనం, ఇతర విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. విద్యార్థులు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు బాధ్యతలు పెరగడం వల్ల పనిభారం తప్పదు. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్య, ప్రయాసలు వంటివి ఎదుర్కొంటారు. 
 
కుంభం : బంధు మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. వాతావరణంలో మార్పు మీ పనులకు ఆటంకమవుతుంది. మీ అభిప్రాయాలకు కుటుంబీకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఏమాత్రం పొదుపు సాధ్యంకాదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. వాహనచోదకులకు చికాకులు అధికమవుతాయి. 
 
మీనం : స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రియమైన వ్యక్తులతో ఉల్లాసంగా గడుపుతారు. రుణాలు తీరుస్తారు. నూతన దంపతులు పరస్పరం మరింత చేరవుతారు. అవగాహనలేని విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13-06-2021 ఆదివారం దినఫలాలు - ఆర్థికంగా బాగుగా కలిసివస్తుంది..