Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

09-06-2021- బుధవారం మీ రాశి ఫలితాలు.. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని..?

Advertiesment
Daily Horoscope
, బుధవారం, 9 జూన్ 2021 (04:00 IST)
శ్రీ లక్ష్మీనృసింహ స్వామిని ఆరాధించినట్లైతే మీ సంకల్పం నెరవేరుతుంది. 
 
మేషం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యల్లో ప్రవేశం లభిస్తుంది. కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. సోదరులు, మిత్రులతో నెలకొన్న వివాదాలు పరిష్కరింపబడతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
వృషభం: శాస్త్ర, సాంకేతిక, మెడికల్ రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పువ్వులు, కూరలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా వుంటుంది. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. గృహోపకరణ వ్యాపారులకు పురోభివృద్ధి. పాత బాకీలు సైతం వసూలవుతాయి. అరుదైన ఆహ్వానాలు రాగలవు.
 
మిథునం: ఆర్థిక లావాదేవీలు, కీలకమైన వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ప్రయాణాలు, బ్యాంక్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. స్త్రీలకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత, మెళకువ అవసరం. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు వ్యాపారులకు సంతృప్తి, ఉద్యోగ, విదేశీయాన యత్నాల్లో సఫలీకృతులవుతారు. 
 
కర్కాటకం: వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు. తరచు దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. కీలకమైన వ్యవహారాలు మీ జీవిత భాగస్వామికి తెలియజేయడం అన్ని విధాలా శ్రేయస్కరం.
 
సింహం: మీ సంతానం ఉన్నత విద్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. బంధువుల కోసం ధనం విరివిగా వ్యయం చేయాల్సి వస్తుంది. ఉన్నతస్థాయి అధికారులు ప్రలోభాలకు దూరంగా వుండటం మంచిది. రిప్రజెంటేటివ్‌లకు ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బ్యాంకు వ్యవహారాలు అనుకూలం. 
 
 
కన్య: రాజకీయ  నాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన పనుల్లో తరచూ ఆటంకాలు ఎదురవుతాయి. స్త్రీలకు తల, నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన చికాకులు తప్పవు. భాగస్వామిక సమావేశాల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. 
తుల: స్త్రీలకు బంధువుల రాకతో పనిభారం అధికమవుతుంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. విదేశీయానం, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. మీ అభిప్రాయాలకు కుటుంబీకుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. 
 
వృశ్చికం: ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత వున్నా మునుముందు సత్ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలు అనుకూలిస్తాయి. ఊహించని వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ప్రేమికుల అనాలోచిత చర్యల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. 
 
ధనస్సు: ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా క్రమంగా సమసిపోతాయి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ పథకాలు, ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. కాంట్రాక్టర్లు నూతన టెండర్లు చేజిక్కించుకుంటారు. పత్రికా సంస్థల్లోని వారికి విధి నిర్వహణలో చిన్న చిన్న తప్పులు దొర్లే ఆస్కారం వుంది.
 
మకరం: సన్నిహితులకు మీ యత్నాలకు సహాయ సహకారాలు అందిస్తారు. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు, చేబదుళ్ళు స్వీకరిస్తారు. క్రయ విక్రయాలు లాభదాయకంగా వుంటాయి. కుటుంబంలోను, సంఘంలోను మీ మాటకు విలువ పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. 
 
కుంభం: ప్రభుత్వ కార్యక్రమాల్లోని పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. నూతన పెట్టుబడులకు మరికొంత కాలం వేచి వుండటం మంచిదని గమనించండి. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు ఆటుపోట్లు తప్పవు. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. 
 
మీనం: వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోభివృద్ధి వుండదు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు మార్చుకోవాల్సి వుంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భక్తులు ఆగండాగండి, కాణిపాకం దర్సన వేళలు మార్చారు, ఎప్పుడంటే?