Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

04-06-2021 శుక్రవారం రాశి ఫలితాలు - హనుమాన్ ఆరాధన వల్ల

04-06-2021 శుక్రవారం రాశి ఫలితాలు - హనుమాన్ ఆరాధన వల్ల
, శుక్రవారం, 4 జూన్ 2021 (04:00 IST)
మేషం : ఆర్థిక వ్యవహారాలలో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వ్యవసాయ రంగాల వారికి చికాకులు తప్పవు. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించడి. సమావేశాలు, వేడుకల్లో ఖర్చులు అధికం. ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం అధికంగా ఉంటుంది. నూతన పరిశ్రమలు, వ్యాపార విస్తరణలు అనుకూలిస్తాయి. 
 
వృషభం : భాగస్వామిక ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వాహన సౌఖ్యం పొందుతారు. మీ యత్నాలకు కుటుంబీకులు సహాయ సహకారాలు అందిస్తారు. రావలసిన ధనం అందకపోవడంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. 
 
మిథునం : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. వస్త్రాలు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. సోదరీ, సోదరుల మధ్య ఆస్తి విషయాల గూర్చి తగాదాలు రావొచ్చు. 
 
కర్కాటకం : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. సతీమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. దుబారా ఖర్చులు అధికం. 
 
సింహం : నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారస్తులకు సంతృప్తినిస్తాయి. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం తగ్గుతుంది. రాజకీయ నాయకులకు పదవీ సమస్యలు అధికమవుతాయి. గృహమునకు కావాల్సిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కానివేళలో బంధు మిత్రుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
కన్య : ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. స్థానచలనానికై చేయు ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. అనవసరవు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవచ్చును. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. 
 
తుల : స్త్రీల తొందరపాటుతనం వల్ల బంధువర్గాల నుంచి మాటపడవలసి వస్తుంది. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. నిర్మాణ పనుల్లో కాంటార్లకు, బిల్డర్లకు చికాకులు తప్పవు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. 
 
వృశ్చికం : వృత్తి వ్యాపారాల్లో సమస్యలెదురైనా ఆదాయానికి కొదవవుండదు. నిరుద్యోగులకు ఉపాథి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువుల కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసి వస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఎంతో సంతృప్తినివ్వగలదు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించడి. 
 
ధనస్సు : ఆర్థికంగా బాగున్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. విద్యార్థులకు కొన్ని నిర్బంధాలకు లోనవుతారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. బంధువులు, సోదరులు, మధ్య ఆత్మీయతలు నెలకొంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. 
 
మకరం : బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాల ప్రశాతంగా సాగుతాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. పదవులు, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. 
 
కుంభం : ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, సముచిత హోదా, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభఫలితాలున్నాయి. మీ మాటకు సర్వత్రా మంచి స్పందన లభిస్తుంది. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. అధికారులు ధనప్రలోభానికి దూరంగా ఉండాలి. 
 
మీనం : ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు సమర్ధంగా నిర్వహిస్తారు. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమ అధికం. ఆదాయం స్వల్పం. బంధువులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ప్రముఖుల సిఫార్సుతో మీ పనులు సానుకూలమవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

03-06-2021 గురువారం రాశి ఫలితాలు - బాబా గుడిలో అన్నదానం చేసినా...