Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10-06-2021 గురువారం దినఫలాలు - దత్తాత్రేయుడుని పూజించినా...

Advertiesment
10-06-2021 గురువారం దినఫలాలు - దత్తాత్రేయుడుని పూజించినా...
, గురువారం, 10 జూన్ 2021 (04:30 IST)
మేషం : సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు క్షేమంకాదు. ఒక యత్నం ఫలిచడంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. పెద్దలు, అయినవారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. 
 
వృషభం : నరాలు, తల, ఎముకలకి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీలకు షాపింగ్‌లోనూ వాహనం నడుపున్నపుడు ఏకాగ్రత ప్రధానం. జాయింట్ వ్యాపారాలు, ఉమ్మడి వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ అకట్టుకుంటారు. 
 
మిథునం : వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది. నూతన ప్రదేశాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్య దాపరికం మంచిదికాదు. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. రాబోయే ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెంచుకుంటారు.
 
కర్కాటకం : పన్నులు, రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. ఆప్తుల సలహాలను పాటిస్తారు. పాత మిత్రులతో కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆకస్మికంగా ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. ప్రేమికులకు మధ్య పెద్దలవల్ల సమస్యలు తలెత్తగలవు. 
 
సింహం : ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఒక యత్నం ఫలించడంతో మీలోకొత్త ఉత్సాహం కనిపిస్తుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రావలసిన ధనం కోసం శ్రమ, ప్రయాసలు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
కన్య : మీ సిఫార్సుతో ఒకరికి చక్కని అవకాశం లభిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయి. విద్యుత్ వస్తువులు పట్ల ఏకాగ్రత చూపుతారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. ఖర్చులు, అవసరాలు పెరగడంతో అదనపు రాబడికై యత్నిస్తారు. వైద్య రంగాలలోని వారికి పురోభివృద్ధి. 
 
తుల : ఏ వ్యక్తితీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఏసీ, కూలర్ మెకానిక్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. 
 
వృశ్చికం : విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ ఉత్సాహాన్ని  అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ప్రణాళికాబద్దంగా పనిచేసి సత్ఫలితాలను పొందుతారు. ఎప్పటి సమస్యలను అపుడు పరిష్కరించుకోవడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి చికాకులను ఎదుర్కొంటారు. 
 
ధనస్సు : భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మిశ్రమ స్పందన ఎదురవుతుంది. కళలు, క్రీడలవారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బ్యాంకింగ్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. 
 
మకరం : స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది. వృత్తి వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. రాజకీయ, కళా రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 
 
కుంభం : రాజకీయ నాయకులు కొంత  సంక్షోభం ఎదుర్కొంటారు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు అని గమనించండి. పాత రుణాలు తీర్చడంతో పాటు తాకట్టు వస్తువులను విడిపిస్తారు. 
 
మీనం : రవాణా రంగాల వారికి చికాకులు తప్పవు. విదేశాల నుంచి ఊహించని అవకాశాలు లభిస్తాయి. కొన్ని పాత వ్యవహారాలు చక్కబడతాయి. రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. బంగారు వ్యాపారులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

09-06-2021- బుధవారం మీ రాశి ఫలితాలు.. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని..?