Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

27-06-2021 ఆదివారం దినఫలాలు - ఇష్టదైవాన్ని ఆరాధించినా....

27-06-2021 ఆదివారం దినఫలాలు - ఇష్టదైవాన్ని ఆరాధించినా....
, ఆదివారం, 27 జూన్ 2021 (04:00 IST)
మేషం : ప్రేమికుల మధ్య ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలు అదనపు బరువు బాధ్యతలను స్వీకరిస్తారు. కొంతమంది మీరు చేస్తున్న వ్యాపారాలకు చేదోడువాదోడుగా ఉంటారు. అందరితో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు. రుణం ఏ కొంతైనా తీర్చగలుగుతారు. 
 
వృషభం : వైద్యుని సలహా తప్పదు. కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు స్త్రీలు అధికంగా ఎదుర్కొంటారు. ధనార్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. చదువుల్లో ఏకాగ్రత వహించడం వల్ల విద్యార్థులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆకస్మికంగా మీకు రావలసిన ధనం సకాలంలో అందుతుంది. 
 
మిథునం : మత్స్యు కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. హోదాలో ఉన్న అధికారులు కొత్త వ్యక్తులను దూరంగా ఉంచడం మంచిది. ఉపాధ్యాయులకు యాజమాన్యం నుంచి ఒత్తిడి, అధికమవుతాయి. రావలసిన ధనం చేతికందుతుంది. స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. బంధువులతో సఖ్యత లోపిస్తుంది. 
 
కర్కాటకం : నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత అవసరం. ప్రేమికులకు పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత ఇతరాత్రా చికాకులు అధికమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. బంధు మిత్రులను కలుసుకుంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
సింహం : ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలలో అసౌకర్యానికి లోనవుతారు. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. పత్రికా, వార్తా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కొత్త రుణాలు కోసం అన్వేషిస్తారు. 
 
కన్య : స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది. సోదరీ, సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల శ్రద్ధ, కొత్త విషయాల పట్ల ఉత్సాహం అధికమవుతాయి. విదులు, వినోదాలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. 
 
తుల : విద్యుత్, ఏసీ కూలర్, మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. బదిలీలు మార్పులు, చేర్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. 
 
వృశ్చికం : మిమ్మల్ని పొగిడేవారేకానీ సహకరించేవారుండరు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. రాజకీయ రంగాల వారికి ప్రభుత్వ పిలుపు అందుతుంది. విద్యా, వైజ్ఞానిక  విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కలిసివచ్చే కాలం. దైవ కార్యాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ఉమ్మడి వ్యాపారాలు, వాణిజ్య ఒప్పందాలు ఒక కొలిక్కి వస్తాయి. వాహనం నడుపునపుడు మెళకువ వహించండి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. 
 
మకరం : శాస్త్ర, సాంకేతిక, కళ, క్రీడా రంగాల వారికి అనుకూలం. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులు ఏమంత సంతృప్తినివ్వజాలవు. రాజకీయ నాయలకు విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో వాయిదాపడుతున్న పనులు పునఃప్రారంభమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. 
 
కుంభం : ఒక స్థిరాస్తి విక్రయించాలన్న ఆలోచన స్ఫురిస్తుంది. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు లాభదాయకం. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రల్లో ఉల్లాసంగా గడుపుతారు. రాజకీయ నాయకులు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
మీనం : స్త్రీమూలకంగా కలహాలు, ఇతరాత్రా చికాకులు ఎదురవుతాయ. క్రయ, విక్రయ రంగాల వారికి నూతన ఉత్సాహం కానవస్తుంది. నూనె, ఎండుమిర్చి వ్యాపారులకు అనుకూలమైన కాలం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధములు రావొచ్చు. రుణాలో కోసం అన్వేషిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

26-06-2021 శుక్రవారం దినఫలాలు - ఆంజనేయ స్వామిని దర్శించినా...