Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై అకౌంట్ పోర్టబులిటీ : ఒకే బ్యాంక్ ఒకే అకౌంట్

ఇప్పటివరకు మొబైల్ పోర్టబులిటీ అనే మాట విన్నాం. ఇది కేవలం మొబైల్ నంబర్లకి మాత్రమే ఇలాంటి వ్యవస్థ ఉంది. కానీ తొలిసారి బ్యాంకింగ్ రంగంలోనూ ఈ విధానాన్ని తీసుకొచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు సన్నద్ధమవుతో

Webdunia
ఆదివారం, 19 నవంబరు 2017 (11:03 IST)
ఇప్పటివరకు మొబైల్ పోర్టబులిటీ అనే మాట విన్నాం. ఇది కేవలం మొబైల్ నంబర్లకి మాత్రమే ఇలాంటి వ్యవస్థ ఉంది. కానీ తొలిసారి బ్యాంకింగ్ రంగంలోనూ ఈ విధానాన్ని తీసుకొచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు సన్నద్ధమవుతోంది. 
 
ఈ సంస్కరణల్లో భాగంగా తొలి దశలో ఒకే బ్యాంకులోని ఇతర అకౌంట్లు రద్దు చేస్తే.. రెండో దశలో ఇతర బ్యాంకుల ఖాతాలు రద్దు చేసి.. ఒక వ్యక్తికి ఒకే బ్యాంక్.. ఒకే అకౌంట్ ఉండేలా చేయనున్నారు. 
 
దీంతో కస్టమర్లకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలందించడంతో పాటు చట్ట విరుద్ధమైన లావాదేవీలకు అవకాశం లేకుండా పోర్టబిలిటీ సేవలను తేవాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్యాంకర్లతో సమావేశమైన ఆర్బీఐ… దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుపుతోంది. 
 
ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్ల అనుసంధానం కూడా దీనికోసమే చేయిస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని బ్యాంకుల్లో ఈ తరహా ప్రక్రియ ఇప్పటికే మొదలైంది కూడా. ఆధార్‌ అనుసంధానం పూర్తయ్యాక ఇది వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా సేవింగ్ అకౌంట్ పోర్టబిలిటీని అందుబాటులోకి తేనున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments