Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రచారకర్తగా బాలీవుడ్ తార సారా అలీ ఖాన్‌తో పర్పుల్.కామ్ ఒప్పందం

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (22:33 IST)
భారతదేశ అగ్రగామి సౌందర్య గమ్యస్థానమైన పర్పుల్.కామ్ బాలీవుడ్ రేపటితరం తార సారా అలీ ఖాన్‌ను తన ప్రచారకర్తగా నియమించుకుంటూ ఒప్పందం కుదుర్చుకుంది. దిగుమతి చేసుకున్న పదార్థాలతో తయారైన ఉత్పత్తులతో అందంలో రాజసానికి ప్రతీకగా పర్పుల్ నిలిచింది. అదే సమయంలో ప్రతీ మహిళలకూ అవి అందుబాటులో ఉంటాయి. అందాన్ని అందరికీ అందించే లక్ష్యంతో అందాన్ని చూసే విషయంలో మహిళకు సాధికారత కల్పించేందుకు పర్పుల్, సారా ఒక్కటయ్యారు.
 
ఈ బ్రాండ్ నూతనంగా సారా అలీ ఖాన్ తో #గోపర్పుల్ క్యాంపెయిన్‌ను ఆవిష్కరించింది. ఇద్దరికీ గల ఒకే ఒక భావన ‘అందరికీ అందం’ అనే లక్ష్యంతోనే ఇది రూపుదిద్దుకుంది. 6000 మేకప్ ఉత్పత్తులు మొదలుకొని ఎగ్జోటిక్ దినుసులతో రూపుదిద్దుకున్న 5000 నేచురల్ ఉత్పాదనల వరకు అన్ని కూడా రూ.400 లోపుగానే ఉంటాయి. నో-క్వశ్చన్స్- ఆస్క్‌డ్ రిటర్న్ పాలసీ మరియు పర్పుల్ పైన ఒకరి మొదటి ఆర్డర్ ఉచిత డెలివరీ వివరాలను సారా ఈ సందర్భంగా పంచుకున్నారు. ప్రతీ నెలా 300 నూతన సౌందర్య ఉత్పాదనలను ఈ బ్రాండ్ ఎలా వెలువరిస్తున్నదీ కూడా ఆమె చెప్పారు.
 
బ్రాండ్‌కు మొదటి ప్రచారకర్తగా  ఉండడంపై సారా అలీ ఖాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘అందరికీ పనికొచ్చే మరియు అందరికీ అందుబాటులో ఉండే సౌందర్యానికి ప్రతీకగా పర్పుల్ నిలిచింది. మహిళలు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునేలా ఇది చేస్తుంది. వారు సాధ్యమైనంత అందంగా ఉండేలా వారు కనిపించేలా, భావించేలా చేస్తుంది. పర్పుల్‌తో ప్రయాణం నాకెంతో ఆనందదాయకం. పర్పుల్ ప్రచారకర్తగా ఉండడం నాకెంతో గర్వకారణం’’ అని అన్నారు.
 
పర్పుల్.కామ్ సహవ్యవస్థాపకులు, సీఈఓ మనీష్ తనేజా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘పర్పుల్ ప్రచారకర్తగా సారాను కలిగిఉండడం మాకెంతో ఆనందదాయకం. శక్తివంతమైన నూతన తరం మహిళ ఆత్మవిశ్వాసానికి మరియు అంకితభావానికి ఆమె ప్రతీక. ఆమె తన భావాలను ధైర్యంగా వ్యక్తీకరిస్తుంటారు. తన చర్మం తీరుతెన్నుల పట్ల ఆమె ఎంతో సౌకర్యవంతంగా ఉన్నారు.

యువతకు శక్తివంతమైన ఆదర్శ మహిళగా నిలిచారు. అందం ప్రతీ ఒక్క ఇంటిని చేరుకునే సౌలభ్యాన్ని అందిస్తూ, వినియోగదారులు తమ సొంత విశిష్ట ప్రయాణాన్ని ఆరంభించేలా ఆమె వారికి స్ఫూర్తిని అందించనున్నారు. మా వినియోగదారులతో అనుసంధానం కావడాన్ని ఈ అనుబంధం మరింత పటిష్ఠం చేస్తుంది. ఈ అనుబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాం’’ అని అన్నారు.
 
ఈ 360 డిగ్రీ క్యాంపెయిన్‌ను స్ప్రింగ్ మార్కెటింగ్ క్యాపిటల్ రూపొందించింది. పటిష్ఠమైన కమ్యూనికేషన్ ప్లాన్‌తో పర్పుల్ తన ఆశయాన్ని సాధించే దిశలో భారతీయులను చేరుకోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments