పాలసీబజార్.కామ్, 2020 ఏప్రిల్-డిసెంబర్ కాల వ్యవధి మధ్య 10 లక్షల మందికి బీమాను అందించడం ద్వారా ఒక కీలక మైలురాయిని సాధించింది. ఈ 9 నెలల కాలంలో పాలసీబజార్ 4 లక్షల ఆరోగ్య బీమా పాలసీలను విక్రయించింది, వీటి మొత్తం సమ్ ఇన్సూర్డ్ విలువ రూ. 7 లక్షల కోట్లకు పైగానే ఉంటుంది. ఇందుకు ప్రధానంగా కారణమైన అంశాల్లో 1) కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తర్వాత ఆరోగ్య బీమా కోసం డిమాండ్ భారీగా పెరిగిపోవడం, 2) కొత్తగా వినూత్నమైన అధిక సమ్ ఇన్సూర్డ్ ప్రొడక్టులను ప్రవేశపెట్టడం 3) అనువైన చెల్లింపు ఆప్షన్లు మరియు 4) ఆరోగ్య బీమా పాలసీలను మరింత సులువుగా అలాగే చౌకగా కొనుగోలు చేయగలిగేలా దోహదం చేసే సరళతరమైన ప్రక్రియలు ఉన్నాయి.
గడిచిన 10 నెలల్లో ఆరోగ్య బీమాకు సంబంధించి డిమాండ్ అత్యంత భారీ స్థాయిలో ఎగబాకింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పెద్దమొత్తంలో వైద్య ఖర్చులు అనేవి ఎల్లప్పుడూ ఉంటాయని, అలాగే దీనివల్ల తగినంత స్థాయిలో ఆరోగ్య బీమా తప్పనిసరి అనే విషయం సామాన్య ప్రజలకు బాగా తెలిసొచ్చింది. ఈ కారణంగా, వినియోగదారులు ఇప్పడు ఉత్తమమైన ఆరోగ్య బీమా ప్రొడక్టుల కోసం చకచకా వెదకడం మొదలుపెట్టారు. ఏప్రిల్-డిసెంబర్ నెలల మధ్య కాలంలో పాలసీబజార్ 1 కోటి మంది సందర్శకులను చవిచూసింది; ఇందులో 65 శాతం మంది 40 ఏళ్ల కంటే తక్కువ వయస్సు కలిగిన వారు కాగా, 25 శాతం మంది 40-60 ఏళ్ల వయస్కులు, అలాగే 10 శాతం మంది 60 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు.
గడిచిన కొద్ది సంవత్సరాల్లో ఆరోగ్య బీమా ప్రొడక్టులు అనేవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇందుకు అధిక సమ్ ఇన్సూర్డ్ కవరేజీ చాలా కీలకంగా మారింది, అలాగే ఇప్పుడు రూ. 1 కోటి సమ్ ఇన్సూర్డ్ విభాగంలో బహుళ ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి. 40 శాతం మంది కస్టమర్లు పాలసీబజార్‌లో ఇప్పుడు ఇలాంటి ప్రొడక్టులను కొనుగోలు చేస్తున్నారు. తక్కువలో ఎక్కువ అనే ప్రధానమైన నమ్మకానికి ఈ ప్రొడక్టులు దన్నుగా నిలుస్తున్నాయి అలాగే ఇవి చౌక ధరల్లో లభిస్తుండటం వల్ల ఈ విధమైన పాలసీ ఆఫర్లలో కస్టమర్లు గణనీయమైన విలువను చూస్తున్నారు. ఉదాహరణకు, ఒక 30 ఏళ్ల వయస్సున్న వ్యక్తి ఇప్పుడు రూ. 1 కోటి సమ్ ఇన్సూర్డ్ ఆరోగ్య బీమా ప్లాన్‌ను, నెలకు రూ. 500 కంటే తక్కువ వ్యయంతో పొందవచ్చు.
కస్టమర్లు తమ ఆరోగ్య బీమా కోసం అత్యంత అనువైన మార్గంలో చెల్లింపులు జరిపే అవకాశం ఉండటం కూడా విక్రయాల్లో ఈ జోరైన వృద్ధికి దోహదం చేసింది. డేటా వెల్లడించిన దాని ప్రకారం, 20 శాతం కస్టమర్లు బహుళ సంవత్సరాల పాలసీలకు ఒకే విడతలో చెల్లింపులు చేయడానికి మొగ్గచూపారు, దీనివల్ల వారు డిస్కౌంట్ పొందడానికి వీలయింది. ఇదివరకే ఆనారోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయడం కుదరదని ప్రజల్లో నెలకొన్న అపోహను కూడా ఈ మహమ్మారి పటాపంచలు చేసింది. మా పరిశీలనలో తేలిందేంటంటే, పాలసీబజార్ ద్వారా విక్రయించిన మొత్తం ఆరోగ్య బీమా పాలసీల్లో ఇలాంటి ముందస్తు అనారోగ్య సమస్యలు ఉన్న వారు కొనుగోలు చేసిన పాలసీల వాటా 30 శాతంగా ఉంది. వీరిలో మధుమేహం (డయాబెటిస్) వ్యాధి అనేది 40 శాతం మందిలో అత్యంత సర్వ సాధారణంగా ఉండగా, 25 శాతం మందికి రక్తపోటు (హైపర్‌టెన్షన్) ఉంది.
పాలసీబజార్ బ్రాండ్‌పై ప్రజలకు ఉన్న అత్యంత నమ్మకం మరియు విశ్వాసానికి ఈ మైలురాయి అనేది స్పష్టమైన ప్రతిబింబంగా నిలుస్తోంది. అన్నింటికంటే ముందుగా కస్టమర్ల అవసరాలు అలాగే వారు కోరుకునే వాటిని అందించడానికి మేము ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యం ఇస్తాం. మా కస్టమర్లతో ఆరోగ్యకరమైన జీవితకాల సంబంధాలను నెలకొల్పుకోవడానికి ఇది మాకు ఎంతగానో దోహదం చేస్తోంది. ఎందుకంటే పాలసీని విక్రయించడం దగ్గర నుంచి, ఆ పాలసీ ఉన్నంత కాలం వరకూ కూడా వారికి సంబంధించిన సేవల అభ్యర్థనలు, రెన్యూవల్‌లు అలాగే అత్యంత ప్రధానంగా వారి క్లెయిమ్‌లను వేగంగా ఆమోదం పొందేలా చేయడంలో మేము వారికి వెన్నుదన్నుగా నిలుస్తాం.
అన్ని పాలసీలకు కోవిడ్ కవరేజీ భరోసాను కల్పించడం, బీమా ప్రక్రియల్లో డిజిటైజేషన్, అలాగే ప్రామాణిక పాలసీలను ప్రవేశపెట్టడంలో ఈ ఏడాది (2020లో) సమయానుకూల చర్యలు చేపట్టిన నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా)కు నేను కచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆరోగ్య బీమాకు సంబంధించి పారదర్శకత మరియు నమ్మకాన్ని పెంపొందించడంలో ఈ చర్యలు ఎంతగానో దోహదం చేశాయి, డిమాండ్‌ను మరింతగా పెంచే సుదీర్ఘ ప్రయాణంలో ఇవి అత్యంత ఆవశ్యకమైనవి అని పాలసీబజార్.కామ్ సీఈఓ సరబ్‌వీర్ సింగ్ పేర్కొన్నారు.
గడిచిన కొన్ని నెలల్లో, బీమా రంగంలోని విభిన్న ప్రక్రియలకు సంబంధించి అండర్‌రైటింగ్ మార్గదర్శకాలు మరియు డిజిటైజేషన్‌లలో చోటుచేసుకున్న మార్పుల వల్ల, ఇప్పుడు ఆరోగ్య బీమా పాలసీని అత్యంత సులువుగా మరియు వేగవంతంగా కొనుగోలు చేయడానికి వీలవుతోంది. ఈ కాల వ్యవధిలో అమ్ముడైన మొత్తం పాలసీల్లో 65 శాతం, కస్టమర్ డిక్లరేషన్ ఆధారంగా నేరుగా జరిగే ప్రక్రియ (స్ట్రెయిట్ త్రూ ప్రాసెస్) ద్వారా తక్షణం జారీ చేయడం జరిగింది. మిగతా 34 శాతం పాలసీలు టెలీ-మెడికల్ ద్వారా మరియు కేవలం 1 శాతం పాలసీలు మాత్రమే భౌతికంగా వైద్య పరీక్షలను జరపడం ద్వారా జారీ అయ్యాయి. అండర్‌రైటింగ్ మార్గదర్శకాల్లో మార్పులు జరగడానికి ముందు భౌతిక వైద్య పరీక్షల ద్వారా జారీ అయ్యే పాలసీలు 15 శాతంగా ఉండేవి. కాబట్టి, కస్టమర్లు ఇప్పుడు అత్యంత సులువుగా మరియు సజావుగా పాలసీని కొనుగోలు చేయడానికి వీలవుతోంది.