Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 22 April 2025
webdunia

మహమ్మారి సమయాన్ని స్వీయ అభివృద్ధి కోసం వినియోగించుకున్నారు: అధ్యయనం వెల్లడి

Advertiesment
Pandemic
, బుధవారం, 27 జనవరి 2021 (20:59 IST)
మహమ్మారి సంవత్సరం 2020 మనల్ని వదిలి వెళ్లిపోయింది కానీ, వైరస్‌ మాత్రం కాదు. నిజానికి ఈ వైరస్‌ మన జీవితాలలో తీసుకువచ్చిన మార్పు, మన జీవితం కాలంలో అతిపెద్ద మార్పుగా చెప్పాల్సి ఉంటుంది. మనం పనిచేసే ప్రాంగణాలపై అది చూపిన ప్రభావంతో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. దీనితో పాటుగా ఇతర అంశాలు కారణంగా 50%కు పైగా వర్క్‌ఫోర్స్‌ ఇప్పుడు డిజిటల్‌ వేదికలపై స్వీయ అభివృద్ధి కార్యక్రమాల కోసం చూస్తుంది. 
 
దీనితో పాటుగా మరిన్ని అంశాలను అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఏఐ శక్తివంతమైన కమ్యూనికేషన్‌ వేదిక మైజెన్‌ డాట్‌ ఏఐ దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడించింది. నూతన సాధారణత వేళ హైబ్రిడ్‌ వర్క్‌ప్లేసెస్‌ వృద్ధి చెందుతున్న వేళ, ‘నూతన సాధారణతకు అత్యంత కీలకం (పివోటింగ్‌ టు ద న్యూ నార్మల్‌)’ శీర్షికన ఈ అధ్యయనం నిర్వహించారు.
 
‘పివోటింగ్‌ టు ద న్యూ నార్మల్‌’ అధ్యయనంలో మైజెన్‌ డాట్‌ ఏఐ కనుగొన్న కీలకాంశాలు ఇలా వున్నాయి:
 
1. స్వీయాభివృద్ధి కార్యక్రమాలు విపరీతంగా (50% శ్రామికశక్తి) ఆదరణ పొందాయి: మహమ్మారి సమయంలో స్వీయ అభివృద్ధి కోసం సమయం కేటాయించిన వ్యక్తుల దగ్గరకు వస్తే 35% మంది స్పందన దారులు 50% కన్నా ఎక్కువ మంది ఈ సమయాన్ని స్వీయ అభివృద్ధి కోసం ఉపయోగించారని భావించారు. ఇదే కోణంలో 45% మంది ప్రజలు అయితే 40% మంది స్వీయ అభివృద్ధి కోసమే దీనికోసమే వినియోగించారన్నారు. తద్వారా అధికశాతం (దాదాపు 80%) మంది ఈ మహమ్మారి సమయంలో 40% స్వీయఅభివృద్ధి కోసం కృషి చేశారన్నారు.
 
2. స్వీయ అభ్యాసం కోసం ఆకర్షణీయంగా కనిపించిన అంశాలు
స్వీయ అభ్యాసం కోసం ప్రధాన ఆకర్షణగా కనిపించిన అంశాలలో సాంకేతిక నైపుణ్యాలు తొలి వరుసలో ఉంటే, అనుసరించి వ్యూహాత్మక ఆలోచన, సృజనాత్మక నైపుణ్యాలు, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మరియు చివరగా లీడర్‌షిప్‌ స్కిల్స్‌ ఉన్నాయి. నిర్థిష్టమైన నైపుణ్యాల దగ్గరకు వస్తే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు దాదాపు 96% మంది కెరీర్‌ వృద్ధికి అతి ముఖ్యమని భావించారు.
 
3. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌కు ఆదరణ
తమ సహచరులు మరియు నాయకులతో ముఖాముఖి సంభాషణ అనేది మహమ్మారి కారణంగా పరిమితమైంది. చాలా సంస్ధలకు డిజిటల్‌ వేదికలు, టెలికామ్‌ సేవలు వంటివి కీలకంగా మారాయి. అధిక శాతం వృత్తులలోని 50%కు పైగా ప్రొఫెషనల్స్‌ డిజిటల్‌ మాధ్యమాలు స్వీయ అభివృద్ధికి తోడ్పడుతున్నాయని భావించారు.
 
4. డిజిటల్‌ వేదికలు- ప్రయోజనాలు, సవాళ్లు
డిజిటల్‌ వేదికల ప్రయోజనాలు మరియు సవాళ్లను గురించి మాట్లాడితే వ్యాప్తి, ఖర్చు, సౌకర్యం, స్వీయ వేగం మరియు 24 గంటల లభ్యత వంటివి అత్యున్నత ప్రయోజనాలు పొందాయి. అదే సమయంలో క్రమశిక్షణ, వ్యక్తిగతీకరణ లేకపోవడం, ముఖాముఖి సంభాషణల లేమి వంటివి డిజిటల్‌ వేదికలపై పెను సవాళ్లుగా మారాయి.
 
5. ఆశ్చర్యం- 24 గంటలూ కమ్యూనికేషన్స్‌ కోచ్‌ ఉండటం మంచి ఆలోచన
ఇప్పటి పనిగంటలలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇప్పుడు అధిక శాతం మంది తమ వ్యక్తిగత సమయం కోరుకుంటున్నారు. 56%కు పైగా స్పందనదారులు 24 గంటల కమ్యూనికేషన్స్‌ కోచ్‌ను అందుబాటులో ఉంచడం చక్కటి ఆలోచనగా భావిస్తున్నారు. తద్వారా తమ వ్యక్తిగత, వృత్తి జీవితాలలో కమ్యూనికేషన్స్‌ పాత్ర వృద్ధిని ఇది స్పష్టంగా సూచిస్తుంది.
 
ఈ అధ్యయనం ‘పివోటింగ్‌ ద న్యూ నార్మల్‌’ను భారతదేశంలో విభిన్న నగరాలలో నిర్వహించారు. దాదాపు 350 మంది స్పందనదారులు దీనిలో పాల్గొన్నారు. ఈ స్పందనదారులలో లెర్నింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ హెడ్స్‌; పీపుల్‌ మేనేజర్స్‌ వంటివారు 30 విభిన్న రంగాల నుంచి ఉన్నారు. ఈ రంగాలలో విద్య, సాంకేతికత, మౌలిక వసతులు, బ్యాంకింగ్‌, కన్సల్టింగ్‌, ఫైనాన్షియల్‌ వంటివి కొన్ని. ఈ అధ్యయనంలో జూనియర్‌, మిడిల్‌ మరియు సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రతినిధులు ఉన్నారు.
 
ఈ అధ్యయన ఫలితాలను  మైజెన్‌ డాట్‌ ఏఐ కో–ఫౌండర్‌ షామ్మీ పంత్‌ వెల్లడిస్తూ ‘‘మహమ్మారి కాలంలో అభ్యాస మరియు అభివృద్ధి పరంగా వచ్చిన మార్పులను తెలుసుకునే ప్రయత్నం ఈ అధ్యయనం ద్వారా చేశాం. అత్యుత్తమ శిక్షణ  పొందడానికి తామున్న ప్రాంతం ఇక ఎంత మాత్రమూ అవరోధం కాదని, చక్కటి ఇంటర్నెట్‌ కనెక్షన్‌,ల్యాప్‌టాప్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలని చాలామంది తెలుసుకోగులుగుతున్నారు. పనిప్రాంగణాలు, సంస్కృతులు, మనసుపై చక్కటి ప్రభావాన్ని వృద్ధి చెందుతున్న సాంకేతికత, డిజిటల్‌ వేదికలు చూపుతున్నాయి..’’ అని అన్నారు.
 
మైజెన్‌ డాట్‌ ఏఐ కో-ఫౌండర్‌ జెన్నీ సారంగ్‌ మాట్లాడుతూ, ‘‘మహమ్మారి మరో మారు ఎల్‌ అండ్‌ డీ, హెచ్‌ఆర్‌ను సెంటర్‌స్టేజ్‌కు తీసుకువచ్చింది. నూతన సాధారణతలో సంస్థలు రూపాంతరం చెందేందుకు అత్యంత కీలకమైన పాత్రను ఇవి పోషించాయి. పనిప్రాంగణాలలో మీ విజయానికి 80% కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అత్యంత కీలకపాత్ర పోషిస్తాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎర్రకోటపై జెండా ఎగురేసి ఏం సాధించాం.. ఆ రైతు సంఘాలు వెనక్కి