కరోనాకు బీమా సౌకర్యం... ముందస్తు వైద్య పరీక్షలు లేకుండానే....

శనివారం, 21 మార్చి 2020 (08:41 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు ఈ వ్యాధికి మందు కాదుకదా.. కనీసం మాత్రకూడా లేదు. ఈ క్రమంలో దేశంలో ఉన్న ప్రైవేట్ బీమా కంపెనీల్లో ఒకటైన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ... తాజాగా కరోనా వైరస్ బారినపడిన రోగులకు కూడా బీమా ల్పించనున్నట్టు ప్రకటించింది. 
 
కరోనా వైరస్ బారినపడి, ఆస్పత్రిలో సేవలు పొందేందుకు అవసరమయ్యే ఖర్చులు కూడా ఈ పాలసీ కింద కవర్‌ అవుతాయి. స్టార్‌ నావెల్‌ కరోనా వైరస్‌ పాలసీని 18 నుంచి 65 ఏళ్ల మధ్య వున్న వారెవరైనా తీసుకోవచ్చు. ప్రభుత్వ సంస్థ నుంచి కరోనా సోకినట్లు ధృవీకరణ పత్రం ఉండాలి.
 
అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన వారు కూడా ఈ పాలసీని తీసుకునే అవకాశం కల్పించడం విశేషం. 21 వేల పాలసీకి 459 రూపాయల ప్రీమియం, 42 వేల రూపాయల పాలసీకి 918 రూపాయల ప్రీమియం చెల్లించాలి. జిఎస్‌టీ అదనం. ఎలాంటి ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోకుండానే ఆన్‌లైన్‌లో కానీ, కంపెనీ ఏజెంట్‌ ద్వారా కానీ ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగితే...