Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సామాజిక బాధ్యతగా టీవీ పరిశ్రమ సంచలన నిర్ణయం

Advertiesment
సామాజిక బాధ్యతగా టీవీ పరిశ్రమ సంచలన నిర్ణయం
, శుక్రవారం, 20 మార్చి 2020 (22:09 IST)
కరోన వ్యాధిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన హెల్త్ ఎమర్జెన్సీకి అనుకూలంగా టీవీ సీరియల్స్, గేమ్ షోస్, వెబ్ సిరీస్ షూటింగ్స్ నిలిపివేయాలని తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ వారు తెలియజేసారు.

ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు శ్రీ కూనప రెడ్డి శ్రీనివాస్ (పెద్ద) మాట్లాడుతూ... దేశం ప్రస్తుతం ఒక పెద్ద ఆరోగ్యపరమైన యుద్ధాన్ని ఎదుర్కొంటోందని కరోన అనే ఈ మహమ్మరిని దేశం నుండి తరిమి వేయాల్సిన సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా మార్చి 31 వరకు అన్ని రకాల షూటింగ్స్ నిలిపి వేస్తున్నట్లు తెలియజేసారు.
 
సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీ మేకల నర్శింగ రావు మాట్లాడుతూ... మా టెలివిజన్ పరిశ్రమ ఎల్లప్పుడూ ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల వెన్నంటే ఉంటుందని దీన్ని మా కనీస బాధ్యతగా భావించి షూటింగ్స్ నిలిపివేయాలని మా అత్యవసర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ కోశాధికారి ఈశ్వర్ మరియు కౌన్సిల్ సభ్యులు లక్ష్మణరావు , రాజేష్, శశాంక, మురారి, నరేందర్ రెడ్డి, రమణయ్య, విజయ్, నాగరాజు, లీగల్ అడ్వైజర్ కెవి. నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వకీల్ సాబ్ సరసన నేను నటిస్తానంటున్న ఇలియానా