Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైల్వే ప్రయాణికులకు తీపికబురు-అందుబాటులోకి ప్రైవేట్ ట్రైన్స్

రైల్వే ప్రయాణికులకు తీపికబురు-అందుబాటులోకి ప్రైవేట్ ట్రైన్స్
, శుక్రవారం, 29 జనవరి 2021 (19:45 IST)
రైల్వే ప్రయాణికులకు తీపికబురు అందింది. కొత్త రైళ్లు అవి కూడా ప్రైవేట్ ట్రైన్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ విషయం ఆర్థిక సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాదిలోనే బిడ్స్ ప్రక్రియ పూర్తి కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ఆవిష్కరించారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే ఈ ఎకనమిక్ సర్వేలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఆర్థిక సర్వే ప్రైవేట్ ట్రైన్స్ అంశాన్ని కూడా ప్రస్థావించింది. 
 
ప్రైవేట్ ట్రైన్స్ కోసం బిడ్స్ ఆహ్వానం 2021 మే చివరకు పూర్తవుతుందని తెలిపింది. ప్రైవేట్ ట్రైన్స్ 2023-24 కల్లా అందుబాటులోకి రావొచ్చని ఆర్థిక శాఖ పేర్కొంది. అలాగే ఎయిర్ ట్రావెల్ 2021 ఆర్థిక సంవత్సరం తొలి నాళ్లలలోనే ప్రీ-కోవిడ్ స్థాయికి చేరొచ్చని తెలిపింది. ఫార్మా రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే ఆర్‌అండ్‌డీ కోసం అధిక కేటాయింపులు జరపాల్సి ఉందని సూచించింది.
 
డిజిటల్ హెల్త్ మిషన్‌ పూర్తి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే టెలీమెడిసిన్‌పై ఇన్వెస్ట్ చేయాల్సి ఉందని సూచించింది. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరంలో (2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు) జీడీపీ 11శాతం మేర పెరగొచ్చని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.7 శాతం మేర తగ్గొచ్చని, కానీ తర్వాత వీ షేప్ రికవరీ ఉంటుందని పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బలవంతంగా ఏకగ్రీవాలు చేసేవారిని హౌస్ అరెస్టు చేస్తాం.. నిమ్మగడ్డ వార్నింగ్