Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ : విత్తమంత్రి బుగ్గన ప్రసంగ హైలెట్స్ ఇవే...

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ : విత్తమంత్రి బుగ్గన ప్రసంగ హైలెట్స్ ఇవే...
, మంగళవారం, 16 జూన్ 2020 (17:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో విత్తమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2020-21 సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో అన్ని రకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించినవాడే నిజమైన నాయకుడు అని చెప్పారు. పేదల కష్టాలను తీర్చేందుకు నవరత్నాలను అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. ఆయన చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే, 
 
ఏపీ మొత్తం బడ్జెట్ వివరాలు..
బడ్జెట్ అంచనా వ్యయం - రూ. 2,24,789.18 కోట్లు
రెవెన్యూ అంచనా వ్యయం - 1,80,392.65 కోట్లు
మూలధన అంచనా వ్యయం - 44,396.54 కోట్లు    
 
సవరించిన అంచనాలు 2019-20:
రెవెన్యూ వ్యయం - రూ. 1,37,518.07 కోట్లు
మూలధన వ్యయం - రూ. 12,845.49 కోట్లు
రెవెన్యూ లోటు - రూ. 26,646.92 కోట్లు
 
వివిధ పథకాలకు కేటాయింపుల వివరాలు:
వ్యవసాయ రంగానికి రూ. 11,891 కోట్లు
వడ్డీలేని రుణాల కోసం రూ. 1,100 కోట్లు
104, 108 పథకాలకు రూ. 470.29 కోట్లు
వైయస్సార్ పంటల ఉచిత బీమా పథకానికి రూ. 500 కోట్లు
వైయస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ రూ. 3,615.60 కోట్లు
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ఉన్నత విద్యకు రూ. 2,277 కోట్లు
 
ఐటీ రంగానికి రూ. 197.37 కోట్లు
ఆరోగ్య రంగానికి 11,419.44 కోట్లు
హోం శాఖకు రూ. 5,988.72 కోట్లు
జలవనరుల శాఖకు రూ. 11,805.74 కోట్లు 
ప్రాథమిక, ఇంటర్ విద్యకు రూ. 22,604 కోట్లు
కార్మిక సంక్షేమ రంగానికి రూ. 601.37 కోట్లు
పశుగణాభివృద్ధి, మత్స్యరంగానికి రూ. 1,279.78 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దికి రూ. 16,710.34 కోట్లు
పెట్టుబడులు, మౌలిక వసతుల రంగానికి రూ. 696.62 కోట్లు 
 
న్యాయశాఖకు - రూ. 913.76 కోట్లు
ఆర్థిక రంగానికి - రూ. 50,703 కోట్లు
ప్రణాళిక రంగానికి - రూ.515.87 కోట్లు
విద్యుత్‌ రంగానికి - రూ. 6,984.72 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి - రూ.2,055.63 కోట్లు
పర్యావరణం, అటవీశాఖకు - రూ.457.32 కోట్లు
అలాగే వివిధ శాఖల కేటాయింపులను పరిశీలిస్తే, 
 
సోషల్‌ వెల్ఫేర్‌ కు - రూ.12,465.85 కోట్లు
ప్రాథమిక ఉన్నత విద్యకు - రూ. 22,604.01 కోట్లు
సాధారణ పరిపాలనకు - రూ.878.01 కోట్లు
కాపుల సంక్షేమానికి - రూ.2,846.47 కోట్లు
ఎస్సీ, ఎస్టీ గృహాల ఉచిత విద్యుత్‌కు - రూ.425.93 కోట్లు
 
ఎస్సీల సంక్షేమానికి - రూ.15,735 కోట్లు
గిరిజనుల సంక్షేమానికి - రూ.5,177.54 కోట్లు
స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు - రూ. 856.64 కోట్లు
పౌరసరఫరాల శాఖకు - రూ. 3,520.85 కోట్లు
రవాణా, ఆర్‌అండ్‌బీ కోసం - రూ.6,588.58 కోట్లు
జగనన్న అమ్మఒడి పథకానికి - రూ.6వేల కోట్లు
వైఎస్సార్‌ ఆసరా పథకానికి - రూ.6,300 కోట్లు
 
వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి - రూ.275.52 కోట్లు
వైఎస్సార్‌ చేయూత పథకానికి - రూ.3వేల కోట్లు
జగనన్న చేదోడు పథకానికి - రూ.247 కోట్లు
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకకు - రూ.16వేల కోట్లు
 
వైఎస్సార్‌‌ సంపూర్ణ పౌషణ పథకానికి - రూ.1500 కోట్లు
మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖలకు - రూ. 8150.24 కోట్లు
గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థకు - రూ.46.46 కోట్లు
మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం - రూ.3456.02 కోట్లు
డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ పథకానికి - రూ.1365.08 కోట్లు
 
వైఎస్సార్ నేతన్ననేస్తం పథకానికి - రూ.200 కోట్లు
జగనన్న తోడు పథకానికి - రూ.930 కోట్లు
రియల్‌ టైం గనర్నెన్స్‌ కోసం - రూ.54.51 కోట్లు
వ్యవసాయ ల్యాబ్‌లకు - రూ.65 కోట్లు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోకియా 5310 పేరిట కొత్త ఫోన్.. ధర రూ.3,999