Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్లు తాగిన తెలంగాణ మంత్రులు, ఆరోగ్యానికి అవి చేసే మేలేంటి?

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (22:06 IST)
తెలంగాణ మంత్రులు కల్లు తాగారు. తాగుతూ జోకులేసుకున్నారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు శుక్రవారం జనగామ జిల్లాలోని రామవరం గ్రామంలో పర్యటించిన సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు.
 
ఈ క్రమంలో మార్గమధ్యంలో వారికి గీత కార్మికులు కనబడ్డారు. దాంతో వారి యోగక్షేమాలు అడిగి తెలుసుంటున్న మంత్రులకు ఓ గీత కార్మికుడు కల్లు తాగాలంటూ అభ్యర్థించాడు. దాంతో ఇద్దరు మంత్రులు కల్లు తాగారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కల్లు తాగుతుండగా ఎర్రబెల్లి కలుగజేసుకుంటూ.. వదిలేస్తే కుండ మొత్తం తాగేస్తడు అంటూ సెటైర్ వేసారు.
 
తాటికల్లు ఎంత ఆరోగ్యమో తెలుసా?
అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లు తాగితే అందులో ఉన్న ఓ సూక్ష్మజీవి మానవుని కడుపులో ఉన్న క్యాన్సర్‌ కారక సూక్ష్మజీవిని నాశనం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చెట్టు నుంచి అప్పుడే తీసిన కల్లు తాగితేనే ఈ ఫలితాలు అందుతాయి. చెట్ల నుంచి కల్లు తీశాక కొన్ని గంటలు అలాగే ఉంచితే పులిసిపోయి ఆల్క్‌హాల్‌గా మారిపోతుంది. 
దాన్ని తాగితే ఆరోగ్యానికి హానికరం. అందుచేత చెట్టు నుంచి అప్పుడే తీసిన కల్లునే తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తాటిచెట్టు ప్రసాదించే కల్లు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తాటికల్లులో ఖనిజ లవణాలు, విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. 
 
మసాలా, మాంసాహారాలు, జంక్ ఫుడ్స్‌ వంటి ఆహారపు అలవాట్లతో అస్తవ్యస్తమైన మానవ జీర్ణ వ్యవస్థను ఈ తాటికల్లు బాగుచేస్తుంది. శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఉదయాన్నే పరగడుపున స్వచ్ఛమైన తాటికల్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని మన పూర్వికులు ఏనాడో చెప్పారు. ప్రస్తుతం ఇది నిజమని పరిశోధనల్లో కూడా తేలిపోయింది. డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణం అయ్యే వైరస్‌కు తాటికల్లు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments