తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లాలో ఇద్దరు మైనర్లు తప్పతాగి ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ మైనర్ బాలిక అత్యాచార ఘటనపై విచారణ మొదలైంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు. ఇద్దరు బాలురు... ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆ దృశ్యాల్ని సెల్ఫోన్లో చిత్రీకరించినట్లుగా ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నాగర్కర్నూల్ జిల్లాలో సంచలనం రేపిన మైనర్ బాలిక అత్యాచార ఘటనపై విచారణ ప్రారంభమైంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ అధికారులు విచారణ మొదలుపెట్టారు. జిల్లాలోని లింగాలలో డిసెంబర్ 31న తప్పతాగి ఇద్దరు మైనర్ బాలురు.. ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్లుగా సామాజిక మాధ్యమాల్లో మొదట వార్తలు వచ్చాయి.