Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళా సైనికులపై లైంగిక దాడులు, హత్యలు.. అమెరికా సైనికాధికారులపై వేటు - Newsreel

Advertiesment
మహిళా సైనికులపై లైంగిక దాడులు, హత్యలు.. అమెరికా సైనికాధికారులపై వేటు - Newsreel
, బుధవారం, 9 డిశెంబరు 2020 (15:27 IST)
టెక్సస్‌లోని ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరంలో హత్య, లైంగిక దాడి, వేధింపులు వంటి హింసాత్మక చర్యల కారణంగా.. 14 మంది కమాండర్లు, కింది స్థాయి సైనికాధికారులను అమెరికా సైన్యం విధుల నుంచి తొలగించింది. ఈ ఏడాది వెనెసా గిలెన్ అనే సైనికురాలి హత్య నేపథ్యంలో ఫోర్ట్ హుడ్ స్థావరంలోని సమస్యలపై దర్యాప్తు ప్రారంభించారు.

 
నాయకత్వ వైఫల్యాల కారణంగానే ఇక్కడ సమస్యలు తలెత్తాయని సైనిక మంత్రి రియాన్ మెక్‌కార్తీ పేర్కొన్నారు. అదృశ్యమైన సైనికుల వ్యవహారంపై కొత్త విధానాన్ని అమలు చేయాలని కూడా సైన్యం ఆదేశించింది. మంగళవారం ఉద్యోగాల్లోంచి తొలగించిన సైనికాధికారుల్లో మేజర్ జనరళ్లు స్కాట్ ఎఫ్లాండ్, జెఫ్రీ బ్రాడ్‌వాటర్‌లు కూడా ఉన్నారు.

 
వెనెసా హత్యోదంతం ''మన అంతఃచేతనను దిగ్భ్రాంతికి గురిచేసింది.. ఫోర్ట్ హుడ్‌లోను, అమెరికా సైన్యంలోను లోతుగా పాతుకుపోయిన సమస్యలను ముందుకు తెచ్చింది'' అని మెక్‌కార్తీ వ్యాఖ్యానించారు. ''ఇది మన వ్యవస్థలను, మన విధానాలను, మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకునేలా పురిగొల్పింది'' అని ఆయన విలేకరులతో చెప్పారు.

 
ఇరవై ఏళ్ల వెనెసా అదృశ్యమైన రెండు నెలల తర్వాత గత జూన్ చివరలో శవమై కనిపించారు. ఫోర్ట్ హుడ్‌లో ఆమెను తీవ్రంగా కొట్టి చంపారని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. ఆమె హత్యలో అనుమానితుడైన స్పెషలిస్ట్ ఆరన్ రాబిన్సన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవటానికి ప్రయత్నిస్తుండటంతో.. అతడు జూలై 1వ తేదీన ఆత్యహత్య చేసుకున్నాడు.

 
ఆరన్ రాబిన్సన్ తమ కుమార్తెను వేధించాడని వెనెసా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే.. ఆమెపై లైంగిక దాడి జరిగిందని కానీ, వేధింపులు జరిగాయని కానీ తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని అధికారులు చెప్తున్నారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.

 
ఫోర్ట్ హుడ్‌ సైనిక స్థావరంలో ఏడాది కాలంలో ఆత్మహత్యలు, హత్యలు, ప్రమాదాల్లో 25 మంది సైనికులు చనిపోయారని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో సైనికాధికారులపై తాజాగా చర్యలు చేపట్టినట్లు చెప్పింది.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతుల నిరసనలు: రైతు సంఘాల లోపల ఏం జరుగుతోంది... వారి వ్యూహాలు ఎలా ఉన్నాయి?