Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిజిటల్ ఇండియాలో మరో ముందడుగు : నేడు ఈ-రూపీ విడుదల

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (08:43 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా మరో ముందడుగు పడింది. నగదు రహిత చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా పేమెంట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకునిరానుంది. 
 
సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఈ-రూపీ (e-Rupi) డిజిటల్‌ చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించనున్నారు. డిజిటల్ లావాదేవీల కోసం ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పే, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులు, అమెజాన్ పే, పేటీఎంతో పాటు చాలానే ఉన్నాయి. నగదు రహిత లావాదేవీల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ-రూపీ విధానాన్ని అందుబాటులో తీసుకువస్తున్నది.
 
ఈ విధానంతో నగదు రహిత లావాదేవీలు మరింత సులభతరంకానున్నాయి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. కేంద్ర ఆర్థిక సేవలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సాయంతో ఈ-రూపీ రూపకల్పన ఈ కొత్త విధానాన్ని రూపొందించింది. 
 
నగదు చెల్లింపులను క్యూ ఆర్ కోడ్, ఎస్ఎంఎస్ స్ట్రింగ్ వోచర్ ద్వారా లబ్దిదారుడి మొబైల్ ఫోన్‌కు పంపిస్తారు. ఈ వోచర్, క్యూఆర్ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైనచోట వినియోగించుకోవచ్చు. డిజిటల్ లావాదేవీల్ని మరింత వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా కేంద్రం ఈ-రూపీని తీసుకువస్తున్నది.
 
నేటి నుంచి అందుబాటులోకి రానున్న ఈ కొత్త విధానం తొలిదశలో కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందే లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలతో సంబంధం లేకుండానే ప్రభుత్వ సహాయం అందనుంది. మొబైల్‌ ఫోన్‌కు క్యూఆర్‌ కోడ్‌, ఎస్‌ఎంఎస్‌ వోచర్‌ రూపంలో నగదు చేరుతుంది. అయితే వాటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments