Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సూపర్ థ్యాంక్స్ అంటున్న యూట్యూబ్.. ఎందుకు..?

Advertiesment
YouTube
అవును.. సోషల్ మీడియాలో అగ్రగామిగా వున్న యూట్యూబ్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. క్రియేటర్ల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని పేరు సూపర్ థ్యాంక్స్. ఈ ఫీచర్ ద్వారా వీడియోలు చూసే వారు దాన్ని రూపొందించిన క్రియేటర్లకు ప్రోత్సాహకంగా 2 డాలర్ల నుంచి 50 డాలర్ల వరకు చెల్లించొచ్చు. ఇకపోతే వీడియోలకు మంచి డిమాండ్ ఉంది. అందుకే చాలా కంపెనీలు షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌ను తీసుకువస్తున్నాయి. 
 
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిల్లో కూడా ఇప్పుడు షార్ట్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా టిక్ టాక్ కూడా కొత్త పేరుతో మళ్లీ భారత్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందని నివేదికలు వెలువడుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో యూట్యూబ్ పోటీని ఎదుర్కోవడానికి క్రియేటర్లను ప్రోత్సహించడానికి యూట్యూబ్ ఈ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని చెప్పుకోవచ్చు. యూట్యూబ్ కొత్తగా తీసుకువచ్చిన ఈ ఫీచర్ 68 దేశాలలో అందుబాటులోకి రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవి పోర్న్ వీడియోలు కాదు... వెబ్ సిరీస్‌ : రాజ్‌కుంద్రా అడ్వకేట్