Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మచేతి వంటపేరుతో పాపులరైన యువతి.. ఎవరో తెలుసా?

Advertiesment
Amma Chethi Vanta
, శుక్రవారం, 25 జూన్ 2021 (13:02 IST)
Amma Chethi Vanta
అమ్మచేతి వంటపేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వెరైటీగా వంటలు చేసే విధానాన్ని తెలియజేస్తూ వీడియోలు పోస్టు చేయటమే.. ఆమె పెట్టే వీడియోలకు వీక్షకుల సంఖ్య పెరగటంతోపాటు ఆమె వంటలకు అభినందనలు వెల్లువలా వస్తుండటంతో అమ్మచేతి వంట యూట్యూబ్ ఛానల్ బాగా పాపులర్ అయ్యింది.
 
వివరాల్లోకి వెళితే.. విశాఖకి చెందిన భార్గవి రాజమండ్రిలో పుట్టి పెరిగింది. 2017లో సంక్రాతి సమయంలో తల్లి గీతాలక్ష్మి వెళ్ళిన సమయంలో పండుగకు వివిధ రకాల పిండి వంటలు తయారు చేస్తుండటంతో తయారీ విధానం వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాలన్న ఆలోచన చేసింది. 
 
ఇందుకు తన తల్లి ప్రోత్సహించటంతో వెంటనే అమ్మచేతి వంట పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. తాను ఇంట్లో వివిధ రకాల స్పెషల్ వంటకాలు చేసినప్పుడల్లా వాటి తయారీ విధానాన్ని కెమెరాలో చిత్రీకరించి దానిని యూట్యూబ్ లో అప్ లోడ్ చేయటం ప్రారంభించింది.
 
వెజ్, నాన్ వేజ్ వంటలతో పాటు, రుచికరమైన స్నాక్స్, అనేక రకాల వంటలతో భార్గవి వీడియోలు పోస్టు చేసేది. ప్రస్తుతం ఆ ఛానల్ సబ్ స్రైబర్లు 20లక్షలుపైగానే ఉన్నారు. యూట్యూబ్ నుండి ఇప్పటికే ఆమె సిల్వర్ బటన్, గోల్డ్ ప్లే బటన్ లను దక్కించుకుంది. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతోనే తాను చేయగలుగుతున్నానని భార్గవి చెబుతున్నారు. పట్టుదలతో ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చని అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్ అధికారుల నిర్లక్ష్యం : మొన్న సన్నీ లియోన్.. నేడు అనుపమ