Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్ర‌భాస్‌తో ప్ర‌మోష‌న్ ఆరంభిస్తున్న అలీ

Advertiesment
ప్ర‌భాస్‌తో ప్ర‌మోష‌న్ ఆరంభిస్తున్న అలీ
, గురువారం, 24 జూన్ 2021 (12:45 IST)
Ali promotion poster
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌తో న‌టుడు అలీ త‌న సినిమా ప్ర‌మోష‌న్‌ను ఆరంభిస్తున్నారు. క‌రోనా త‌ర్వాత షూటింగ్‌లు, సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైన వేళ ఆయ‌న న‌టిస్తూ నిర్మిస్తున్న సినిమా  ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’లోని ఓ గీతాన్ని విడుద‌ల చేస్తున్నారు. మలయాళంలో విడుదలై సంచలన విజయంగా నమోదైన ‘వికృతి’ చిత్రానికిది రీమేక్‌. క‌రోనాకు ముందే `నా గుండె చిక్కుకుంది నీ కళ్లతో...’’ అంటూ అలీ, మౌర్యానితో గీతాన్ని కాశ్మీర్‌లో చిత్రించారు. ఏ.ఆర్‌ రెహమాన్‌ వద్ద అనేక సినిమాలకు పనిచేసిన రాకేశ్‌ పళిదం ఈ చిత్రంతో సంగీత దర్శకునిగా ఆరంగేట్రం చేస్తున్నారు.
 
అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌ నిర్మిస్తున్నారు. జనవరిలో ప్రారంభమైన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుని ఇప్పటివరకు 90 శాతం పూర్తి చేసుకుంది. 1100 సినిమాల్లో నటించిన అలీ హీరోగా తన బ్యానర్‌లో నిర్మిస్తోన్న తొలిచిత్రం కావటంతో ఎంతో గ్రాండియర్‌గా సినిమాను తెరకెక్కించే ఉద్ధేశ్యంతో ఎక్కడ రాజీపడకుండా దాదాపు 20 మంది అగ్ర నటీనటులతో సినిమాను నిర్మిస్తున్నారు.
 
ఇన్‌స్టాగ్రామ్‌ స్టార్‌ ప్రణవి మానుకొండ నరేశ్‌ కూతురిగా కీలకపాత్రలో నటించారు. ఇంకా మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి,సనా, వివేక్, సప్తగిరి, పృధ్వీ, రామ్‌జగన్, భద్రం,లాస్య తదితరులు నటించారు. ఈ చిత్రానికి చీఫ్‌ క్రియేటివ్‌ హెడ్‌– ఇర్ఫాన్, కో డైరెక్టర్‌– ప్రణవానంద్‌
కెమెరా– ఎస్‌ మురళీమోహన్‌ రెడ్డి, ఆర్ట్‌– కెవి రమణ, డాన్స్‌ డైరెక్టర్‌– స్వర్ణ, ఎడిటర్‌– సెల్వకుమార్, ఫైట్స్‌–నందు, మేకప్‌–నంద్యాల గంగాధర్, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌– సయ్యద్‌ తాజ్‌ బాషా, విఎఫ్‌ఎక్స్‌– మాయాబజార్‌ స్టూడయో.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంట‌గా నరుడి బ్రతుకు నటన