Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో నూతన స్టూడియో ప్రారంభించిన పెప్పర్‌ఫ్రై

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (22:58 IST)
ఈ-కామర్స్‌ ఫర్నిచర్‌, గృహ ఉత్పత్తుల కంపెనీ పెప్పర్‌ఫ్రై , ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వద్ద తమ మొదటి స్టూడియో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ ఆఫ్‌లైన్‌ విస్తరణ, సముచిత మార్కెట్‌లలో విస్తరించడంతో పాటుగా భారతదేశంలో ఫర్నిచర్‌, గృహ ఉత్పత్తుల విభాగంలో అతిపెద్ద ఓమ్నీ ఛానెల్‌ వ్యాపారాన్ని సృష్టించాలనే కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. పెప్పర్‌ఫ్రైకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 100కు పైగా నగరాలలో 200కు పైగా స్టూడియోలు  ఉన్నాయి. 
 
భారతదేశంలో ఫర్నిచర్‌ రిటైల్‌ ల్యాండ్‌స్కేప్‌ను సమూలంగా పెప్పర్‌ఫ్రై   స్టూడియోస్‌ మార్చింది. ఈ కంపెనీ యొక్క ఓమ్నీ ఛానెల్‌ వ్యూహానికి దేశవ్యాప్తంగా ఫోఫో స్టూడియోల విస్తరణ తోడ్పాటునందిస్తుంది. ప్రస్తుతం ఇది 90కు పైగా  వినూత్న భాగస్వాములతో  కలిసి పనిచేస్తుంది. ఈ స్టూడియోను శ్రీ వాసవి స్టీల్‌ అండ్‌ సిమెంట్స్‌ భాగస్వామ్యంతో ప్రారంభించారు. తిరుపతి లోని అత్యంత కీలకమైన వాణిజ్య ప్రాంతం ఏకె పల్లి రోడ్‌, మంగళం రోడ్‌, శ్రీరామ్‌ నగర్‌, తిరుపతి వద్ద ఇది 1110 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది వినియోగదారులకు విస్తృత శ్రేణి ఫర్నిచర్‌, హోమ్‌ ప్రొడక్ట్‌ తొలి అనుభవాలను అందిస్తుంది. ఈ స్టూడియోలో డిజైన్‌ నిపుణులు కూడా ఉండటం వల్ల, ప్రత్యేకమైన డిజైన్‌ సలహాలను సైతం పొందవచ్చు. తిరుపతి లోని ఈ స్టూడియో ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని గృహ, లివింగ్‌ వినియోగదారుల వినూత్న అవసరాలను తీర్చేందుకు వ్యక్తిగతీకరించిన షాపింగ్‌ అనుభవాలను సైతం అందిస్తారు.
 
ఈ స్టూడియోప్రారంభం గురించి పెప్పర్‌ ఫ్రై బిజినెస్‌ హెడ్‌- ఫ్రాంచైజింగ్‌ అండ్‌ అలయెన్సస్‌, అమృత గుప్తా మాట్లాడుతూ, ‘‘ శ్రీ వాసవి స్టీల్‌ అండ్‌ సిమెంట్స్‌‌తో భాగస్వామ్యం చేసుకుని తిరుపతిలో మా మొదటి స్టూడియోను ప్రారంభించడం ద్వారా మా ఓమ్నీ ఛానెల్‌ కార్యకలాపాలను విస్తరించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. పెప్పర్‌ ఫ్రై ఫ్రాంచైజీ సొంతం చేసుకోవడం వ్యాపారపరంగా విజయం సాధించడం, మేము వినియోగదారులను మెట్రోపాలిటన్‌ ప్రాంతాలలో మాత్రమే కాకుండా టియర్‌ 1 నగరాలలో కూడా చేరుకోవాలనుకుంటున్నాము. మా ఫ్రాంచైజీ భాగస్వాములలో విజయవంతమైన వ్యాపారవేత్తలు, మహిళా వ్యాపారవేత్తలు, మాజీ ఆర్మీ అధికారులు, తొలిసారి వ్యాపార రంగంలో అడుగుపెట్టిన వారు ఉన్నారు. నేడు అధికశాతం మా పెప్పర్‌ ఫ్రై  వినియోగదారులు ఏఆర్‌ మరియు వర్ట్యువల్‌ ప్రొడక్ట్‌ ఇంటరాక్షన్స్‌ పై ఆధారపడి సంభాషణలు చేస్తున్నారు. ప్రపంచమంతా ఇల్లే అనే భావనను ప్రతి ఒక్కరిలోనూ రేకిత్తించే లక్ష్యంతో  మేము మహోన్నతమైన వినియోగదారుల సేవలను స్ధిరంగా అందించడానికి ప్రయత్నిస్తున్నాము’’అని అన్నారు.
 
తిరుపతిలోని పెప్పర్‌ ఫ్రై ఫ్రాంచైజీ స్టూడియో యజమాని మనోజ్‌ మాట్లాడుతూ ‘‘భారతదేశంలో సుప్రసిద్ధ హోమ్‌, ఫర్నిచర్‌ మార్కెట్‌ ప్రాంగణం పెప్పర్‌ఫ్రైతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. పూర్తి వైవిధ్యమైన ఓమ్నీ ఛానెల్‌ వ్యాపారం పెప్పర్‌ ఫ్రై.  పెద్ద ఓమ్నీఛానెల్‌ గృహ, ఫర్నిచర్‌ వ్యాపారం సృష్టించాలనే వారి ప్రయాణంలో చేరడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము’’అని అన్నారు.
 
తెలంగాణా రాజధాని హైదరాబాద్‌లో మూడు నూతన స్టూడియోలను ప్రారంభించిన పెప్పర్‌ఫ్రై
సుప్రసిద్ధ ఈ-కామర్స్‌ ఫర్నిచర్‌, గృహ ఉత్పత్తుల కంపెనీ పెప్పర్‌ఫ్రై , తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ లో  మూడు నూతన స్టూడియోలను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ ఆఫ్‌లైన్‌ విస్తరణ, సముచిత మార్కెట్‌లలో విస్తరించడంతో పాటుగా భారతదేశంలో ఫర్నిచర్‌ మరియు గృహ ఉత్పత్తుల విభాగంలో అతిపెద్ద ఓమ్నీ ఛానెల్‌ వ్యాపారాన్ని సృష్టించాలనే కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. పెప్పర్‌ఫ్రైకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 100కు పైగా నగరాలలో 200కు  పైగా స్టూడియోలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments