తెనాలిలో దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ భారీ విగ్రహం సిద్ధమైంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షలు భారీ ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని రూపొందించారు. 21 అడుగుల ఎత్తులో 3డి సాంకేతికతతో ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేశారు.
ఈ విగ్రహాన్ని రెడీ చేసేందుకు నాలుగు నెలల సమయం పట్టింది. బెంగళూరులో ప్రదర్శన కోసం ఈ విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఈ విగ్రహాన్ని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆవిష్కరించి, శిల్పులను అభినందించారు.
అలాగే 3డి సాంకేతికతతో తయారుచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిన్న ప్రతిమను శిల్పి శ్రీహర్ష ఎమ్మెల్యేకు బహూకరించారు. త్వరలోనే పునీత్ రాజ్‌కుమార్ విగ్రహాన్ని బెంగళూరుకు తరలించనున్నారు.
మరోవైపు బెంగళూరులో పునీత్‌రాజ్‌కుమార్ పేరిట నిర్మించిన పార్కు ప్రారంభమయ్యింది. పునీత్ రాజ్‌కుమార్ గతేడాది అక్టోబర్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే.