ఇంట్లోకి రాత్రి పూట వచ్చిన మొసలి... చివరికి ఏం జరిగిందంటే?

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (20:10 IST)
Crocodile
ఇంట్లోకి రాత్రి పూట మొసలి వచ్చింది. అవును షాకింగ్‌గా వుంది కదూ.. అవును.. మొసలి రావడం చూసి ఆ కుటుంబం ఉలిక్కిపడింది. రాత్రంతా మొసలితోనే గడిపారు. తెల్లారి అధికారులు వచ్చి సహాయక చర్యలు చేపట్టేవరకు ప్రాణాలు అరచేత పట్టుకుని గడిపారు. ఈ ఘటన ఉత్తర‌ప్రదేశ్, ఎతావా పరిధిలోని జైతియా అనే గ్రామంలో గత శనివారం రాత్రి జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. జైతియా గ్రామంలోని హర్‌నామ్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లోకి రాత్రి ఒక మొసలి ప్రవేశించింది. ఏదో శబ్ధం వచ్చిందని మేల్కొని చూసే సరికి ఇంట్లో ఎనిమిది అడుగుల మొసలి కనిపించింది. వెంటనే భయాందోళనకు గురైన ఆ కుటుంబం పోలీసులకు సమాచారం అందించింది. 
 
తర్వాత ఉదయం ఆరు గంటలకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది ఆ ఇంటికి చేరుకుని మొసలిని పట్టుకునే ప్రయత్నం చేశారు. దాదాపు గంటసేపు శ్రమించి, మొసలిని సురక్షితంగా బంధించారు. 
 
తర్వాత మొసలిని అటవీశాఖ సిబ్బంది రక్షణ ప్రదేశానికి తీసుకెళ్లారు. దీంతో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ, ప్రాణాలు అరచేత పట్టుకుని గడిపిన ఇంట్లోని వాళ్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ మొసలిని సురక్షితమైన నీటి ప్రదేశంలో వదిలిపెడతామని అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments