ఐప్యాక్ అధినేత, ఎన్నికల జాతీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పదవీకాంక్ష కోసం పని చేసిచేశానని తెలిపారు. నిజానికి ఈ పని చేయడానికి బదులు కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణకు పాటుపడి ఉండాల్సింది అని అభిప్రాయపడ్డారు.
రాజకీయాల్లో మార్పు కోసం జన్ సురాజ్ పేరుతో ఆయన మహాత్మాగాంధీ జయంతి రోజున పశ్చిమ చంపరాన్ జిల్లాలోని భితిఙర్వా నుంచి 3500 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మహాత్మాగాంధీ 1917లో ఇక్కడి నుంచి మొదటి సత్యాగ్రమ ఉద్యమాన్ని ప్రారంభించారు. తాజాగా ఈ యాత్ర ఆదివారం లౌరియాకు చేరుకుంది.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ల కోసం పని చేయకుండా కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవానికి కృషి చేసివుంటే బాగుండేదని అన్నారు. అసలైన మహాత్మా గాంధీ కాంగ్రెస్‌కు పునరుజ్జీవం పోయడంద్వారా మాత్రమే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించగలమనే విషయాన్ని సత్యం తనకు ఆలస్యంగా అర్థమైందన్నారు.
అంతేకాకుండా, బీజేపీని అర్థం చేసుకోకుండా ఆ పార్టీని ఓడించడం కష్టమని విపక్ష కూటమికి సూచించారు. ఓ కప్పులో ఉండే పైపే నురగే బీజేపీ అయితే, దానికింద ఉండే అసలైన కాఫీయే ఆర్ఎస్ఎస్ అని అన్నారు. సామాజిక వ్యవస్థలో అది భాగమైపోయిందని, షార్ట్‌కట్స్‌తో దానిని ఓడించలేమన్నారు.