Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబుదాబీ టీ10 లీగ్‌లో బంగ్లా టైగర్స్‌కు స్పాన్సర్‌ చేయడానికి పరిమ్యాచ్‌ న్యూస్‌ ఒప్పందం

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (17:39 IST)
స్పోర్ట్స్‌, ఈ-స్పోర్ట్స్‌, వినోద క్రేందంగా భాసిల్లుతుండటంతో పాటుగా అత్యున్నత నాణ్యత కలిగిన క్రీడా కవరేజీ అందించేందుకు కట్టుబడి, భారతదేశ వ్యాప్తంగా క్రీడాభిమానులకు విప్లవాత్మక ఎనలిటిక్స్‌ను అందిస్తోన్న పరిమ్యాచ్‌ న్యూస్‌, అబుదాబీ టీ 10 లీగ్‌లో బంగ్లా టైగర్స్‌ టీమ్‌కు ఒక సంవత్సరం పాటు టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా టైగర్స్‌ ఇప్పుడు తమ జెర్సీల ముందుభాగంలో బ్రాండ్‌ లోగోను ప్రదర్శించనున్నారు.
 
అబుదాబీ టీ 10 లీగ్‌- ఒకే ఒక్క ఐసీసీ అనుమతించిన 10 ఓవర్ల లీగ్‌. ఈ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 మిలియన్ల మంది వీక్షకులు ఉన్నారని అంచనా. ఇది నవంబర్‌ 23 నుంచి జరుగనుంది. ఈ పోటీలు డిసెంబర్‌ 04 వరకూ జరుగనున్నాయి. మొత్తం మ్యాచ్‌లన్నీ ఎమిరేట్స్‌ షేక్‌ జయేద్‌ క్రికెట్‌ స్టేడియంలో జరుగనున్నాయి.  ఈ లీగ్‌లో భాగంగా ఈ సీజన్‌ కోసం రెండు నూతన టీమ్‌లు జోడించబడ్డాయి. అవి మోరిస్‌విల్లీ శాంప్‌ అర్మీ మరియు న్యూయార్క్‌ సై్ట్రకర్స్‌. వీరు బంగ్లా టైగర్స్‌, ఢిల్లీ బుల్స్‌, టీమ్‌ అబుదాబీ, నార్త్రన్‌ వారియర్స్‌, దక్కన్‌ గ్లాడియేటర్స్‌ మరియు చెన్నై బ్రేవ్స్‌తో పోటీపడనున్నారు. ఈ పోటీల్లో డిఫెండింగ్‌ చాంఫియన్స్‌గా దక్కన్‌ గ్లాడియేటర్స్‌ పాల్గొంటున్నారు. వీరు 2021లో జరిగిన ఫైనల్స్‌లో ఢిల్లీ బుల్స్‌పై విజయం సాధించారు.
 
బంగ్లా టైగర్స్‌ టీమ్‌కు కెప్టెన్‌గా వారి ఐకానిక్‌ ఆటగాడు షకీబ్‌ అల్‌ హసన్‌ వ్యవహరించనున్నాడు. ఈ టీమ్‌లో లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ మొహమ్మద్‌ అమిర్‌; విధ్యంసకర బ్యాటర్లు ఇవిన్‌ ల్యూయిస్‌, కొలిన్‌ మున్రో మరియు హజరతుల్లా జాజీ ఉన్నారు. ఈ పోటీలో  అత్యున్నత ప్రదర్శన కనబరిచే టీమ్‌లలో ఒకటిగా ఈ టైగర్స్‌ నిలవడం మాత్రమే కాదు, రెండవ అతి పెద్ద ఫ్యాన్‌బేస్‌ను కూడా కలిగి ఉంది. అంతేకాదు, ఏడీటీ 10 లీగ్‌లో పాల్గొంటున్న మొట్టమొదటి బంగ్లాదేశీ గ్లోబల్‌  క్రికెట్‌ ఫ్రాంచైజీ ఇది.
 
బంగ్లా టైగర్స్‌ యజమాని శ్రీ మొహమ్మద్‌ యాసిన్‌ చౌదరి మాట్లాడుతూ, ‘‘పరిమ్యాచ్‌ న్యూస్‌తో  భాగస్వామ్యం చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. సర్వింగ్‌ విభాగంలో అగ్రగామి సంస్ధలలో ఇది ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా మరీ ముఖ్యంగా భారత దేశంలో క్రికెట్‌కు మరింత ప్రాచుర్యం కల్పించడంలో ఇది అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది’’ అని  అన్నారు.
 
పీఎంఐ సీసీఓ దిమిత్రీ బెలియనిన్‌ మాట్లాడుతూ ‘‘టీ 20 ఏ విధంగా నూతన ప్రేక్షకులను ఆకట్టుకుందో మేము చూశాము. టీ 10 కూడా అదే తరహా ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా చూపగలదని ఆశిస్తున్నాము. ఈ కారణం చేతనే అబుదాబీ టీ 10 లీగ్‌తో భాగస్వామ్యం చేసుకోవడాన్ని పరిమ్యాచ్‌ గర్వంగా భావిస్తోంది. మరీ ముఖ్యంగా యూరోప్‌ లాంటి సరికొత్త ప్రాంతాలలో ఈ క్రీడకు ప్రాచుర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న వేళ ఈ భాగస్వామ్యం చేసుకోవడం ఆనందంగా ఉంది. వ్యక్తిగతంగా బంగ్లా టైగర్స్‌ ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మరీ ముఖ్యంగా ప్రపంచశ్రేణి ఆటగాళ్లు షకీబ్‌ అల్‌ హసన్‌, మొహమ్మద్‌ అమిర్‌ ప్రదర్శన చూడటానికి ఆసక్తిగా ఉన్నాను’’ అని  అన్నారు.
 
క్రీడా ప్రపంచంలో ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తున్నది పరిమ్యాచ్‌ న్యూస్‌. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ న్యూస్‌ మరియు క్రీడాకార్యక్రమాలు పరిమ్యాచ్‌ న్యూస్‌పై ప్రచురితమవుతాయి. మా వెబ్‌సైట్‌ మిమ్మల్ని క్రీడా ప్రపంచంలోకి తీసుకుపోవడం మాత్రమే కాదు, అసమానమైన క్రీడా ప్రపంచంలో మీరు కూడా ఓ భాగమనే అనుభూతి పొందేలా చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments