కేంద్రం సామాన్య ప్రజలకు షాకివ్వనుంది. ఈ ఏడాది ప్రారంభంలో ధరల నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్‌పై ప్రాథమిక దిగుమతి ట్యాక్స్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా పామాయిల్ దిగుమతి సుంకాలను 6 నుంచి 11 శాతం పెంచనుంది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. వంటనూనెలపై దిగుమతి సుంకాలు పెంపు నిర్ణయంతో వినియోగదారులకు కష్టాలు తప్పేలా లేవు. కందుల గింజల ధరల కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు ఈ రేట్లను పెంచనున్నట్లు కేంద్రం చెప్తోంది.
ముడి పామాయిల్ దిగుమతి సుంకం టన్నుకు 858 డాలర్ల నుంచి 952 డాలర్లకు పెరిగింది. ఆర్బీడీ పామాయిల్ దిగుమతి సుంకం టన్నుకు 905 డాలర్ల నుంచి 962 డాలర్లకు పెరిగింది. ఇక ఇతర పామాయిల్ టారిఫ్ కూడా పెరిగింది. టన్నుకు 882 డాలర్ల నుంచి 957 డాలర్లకు ఎగిసింది.