ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా, ఆదివారం పెర్త్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ జట్టు తొలి ఓటమిని రుచి చూసింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలుపొందిన భారత్.. మూడో మ్యాచ్‌లో మాత్రం సఫారీల చేతిలో చిత్తయ్యారు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. ఆది నుంచి కష్టల్లో పడింది. ఒక దశలో 49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, మిడిల్ ఆర్డర్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ బాధ్యతాయుతంగా ఆడటంతో భారత్ 133 పరుగులు చేయగలిగింది.
ఆ తర్వాత 134 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 19.4 ఓవర్లలో 134 పరుగులు చేసి ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్‌పై తన విశ్వరూపాన్ని ప్రదర్శించే డేవిడ్ మిల్లర్ ఈ మ్యాచ్‌లోనూ మరోమారు బ్యాట్‌తో వీర విహారం చేశాడు. 49 బంతుల్లో 59సమార్ క్రమ్ కూడా 52 పరగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, భారత్ నిర్దేశించిన స్వల్ప స్కోరును ఛేదించేందుకు సఫారీలు అపసోపాలు పడ్డారు.
భారత బౌలర్లు లైన్ లెంగ్త్‌తో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాబట్టడం గగనమైపోయింది. చివరకు ఆఖరు ఓవర్‌లో విజయానికి ఆరు పరుగులు కావాల్సి ఉండగా, బంతిని భువనేశ్వర్‌కు ఇచ్చారు. తొలి మూడు బంతులను ఎంతో జాగ్రత్తగా వేసిన భువీ.. నాలుగో బంతిని మాత్రం షార్ట్ బౌల్‌గా వేసి ఫోర్ బాదేలా చేశాడు. దీంతో సౌతాఫ్రికా విజయం సులువైపోయింది.
అంతకుముందు టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, సౌతాఫ్రికా బౌలర్లు భారత ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. ఫలితంగా 49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ దశలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఆపద్బాంధవ పాత్రను పోషించారు. ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా తాను మాత్రం క్రీజ్‌లో పాతుకునిపోయి పరుగులు చేశారు. ఫలితంగా వంద పరుగుల మార్క్‌ను భారత్ దాటగలిగింది.
ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన రాహల్ 9, రోహిత్ శర్మ 15, కోహ్లీ 12, హుడా 0, పాండ్యా 2 ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు చేరారు. ఫలితంగా 49 పరుగులకే ఐదు ప్రధాన వికెట్లను కోల్పోయింది. సఫారీ బౌలర్లలో లుంగీ ఎంగిడి నాలుగు వికెట్లు తీశారు.
కానీ సూర్యకుమార్ మాత్రం క్రీజ్‌లో పాతుకునిపోయి 68 పరుగులు చేశాడు. మొత్తం 40 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ 3 సిక్స్‌లు, ఆరు ఫోర్ల సాయంతో ఈ పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. కార్తీక్ 6, అశ్విన్ 7, భువనేశ్వర్ కుమార్ 4 చొప్పున పరుగులు చేయగా షమీ డకౌట్ అయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.