Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోడలపై సొగసైన ఎఫెక్టులు సృష్టించడానికి వోగ్‌ని ప్రారంభించిన జెఎస్‌డబ్ల్యు పెయింట్స్

Advertiesment
image
, సోమవారం, 31 అక్టోబరు 2022 (23:15 IST)
భారతదేశపు ప్రముఖ పర్యావరణ-స్నేహపూర్వక పెయింట్ల కంపెనీ, 22 బిలియన డాలర్ల విలువైన JSW గ్రూపులో భాగమైన JSW పెయింట్స్, వోగ్ శ్రేణి ఫినిషింగ్లను ప్రవేశపెట్టింది. ఇది ఇంటి అలంకరణకు సొగసులద్దేలా రంగరించిన గోడ ఎఫెక్టులను అందిస్తుంది. ఆధునిక, కాస్మోపాలిటన్ భారతీయ వినియోగదారుడికి సొగసైన గోడలను సృష్టించడానికి విలాసవంతమైన ఎఫెక్టులను అందించడం ద్వారా కంపెనీ తన "థింక్ బ్యూటిఫుల్" వాగ్దానాన్ని వోగ్‌కు విస్తరించింది. ఫ్యాషన్, సంస్కృతిలో తాజా పోకడల నుండి ప్రేరణ పొందిన వోగ్ ఇంట్లో సజీవమైన గోడలను అందిస్తుంది.
 
లగ్జరీ, స్టైల్, ప్రత్యేకత ఉట్టిపడేలా గోడలకు ఎఫెక్టులను సృష్టించడం ద్వారా వోగ్ ఊహాశక్తి, సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. ఊహాశక్తికి మరింత హంగులద్దడానికి, వోగ్ 8 ప్రత్యేకమైన గోడ ఎఫెక్టులను పరిచయం చేసింది. ప్రకృతి, సంస్కృతి నుండి ప్రేరణతో అవి రూపొందించబడ్డాయి. పురాతన భారతీయ ఫ్యాబ్రిక్ నమూనా పద్ధతుల్లో సౌందర్యాన్ని బందేజ్ ఎఫెక్టు ప్రతిబింబిస్తుంది. మరోవైపు, ఇకాట్ ఎఫెక్టు… లివింగ్ స్పేస్ అంతటా లగ్జరీని విస్తరించే ఫ్యాబ్రిక్ రంగుతో అస్పష్టమైన, ఇంకా మనోహరమైన టెక్నిక్‌ను అందిస్తుంది.
 
బ్లేజ్ ఎఫెక్టు అభిరుచి, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండగా, స్టాక్స్ ఎఫెక్టు ఒక క్లాసిక్, రిలాక్స్డ్ లుక్ ఇస్తుంది, ఇది గోడపై అందమైన యాక్సెంట్ సృష్టిస్తుంది. పాస్టెల్స్ అభిమాని, నిర్మలమైన రూపాన్ని ఇష్టపడితే, అప్పుడు హారిజన్ ఆ అనుభూతిని తెస్తుంది.
 
థాచెస్ ఎఫెక్టు ఒక దేశీయ-శైలి అలంకరణ రూపాన్ని ఇస్తుంది. ఇది మోటైనది, కాలాతీతమైనది, హోమ్లీగా అనిపిస్తుంది. థాచెస్ ఎరినైనా తమ మూలాలతో అనుసంధానించడానికి సహాయపడుతుండగా, ఆర్బిటల్ ఎఫెక్టు అంతరిక్షంలోకి సాహసోపేతమైన ప్రయాణంలోకి తీసుకెళుతుంది.  ఖగోళశాస్త్రం పట్ల ప్రేమను కొనసాగిస్తూ, మీటియోర్ ఎఫెక్టు… మీటియోరాయిడ్ షవర్లో మంత్రముగ్ధులను చేసే అందాన్ని పునరావృతం చేయడానికి జాగ్రత్తగా రూపొందించబడింది.
 
JSW పెయింట్స్ జాయింట్ ఎండి మరియు సీఈవో ఎఎస్ సుందరేశన్ మాట్లాడుతూ, "JSWపెయింట్స్ అందించే వోగ్ అనేది గోడల మీద విలాసవంతమైన విజువల్ ఎఫెక్ట్స్ తెచ్చే డిజైనర్ సేకరణ. భారతదేశం, ప్రకృతి మరియు అంతరిక్షం నుండి ప్రేరణ పొంది, ఫ్యాషన్ ఎఫెక్టులను రంగరించి ఈ సేకరణను ముందుకు తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవి మీ ఊహాశక్తిని వెలికితీసి, గొప్ప విజువల్ ఎఫెక్ట్స్, అల్లికలతో ఇళ్లను ఆహ్లాదకరంగా అలంకరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి." అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో నూతన స్టూడియో ప్రారంభించిన పెప్పర్‌ఫ్రై