Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వినియోగదారుల ఆరోగ్యం, సంక్షేమంపై దృష్టి సారించి జెఎస్‌డబ్ల్యు పెయింట్స్‌ వినూత్నమైన ఉత్పత్తుల ఆవిష్కరణ

Alia Bhatt
, బుధవారం, 25 మే 2022 (22:26 IST)
భారతదేశంలో పర్యావరణ అనుకూల పెయింట్స్‌ కంపెనీ, 13బిలియన్‌ డాలర్ల జెఎస్‌డబ్ల్యు గ్రూప్‌లో భాగమైన జెఎస్‌డబ్ల్యు పెయింట్స్‌  తమ ఉత్పత్తి ప్రచారాన్ని హలో ఆక్వాగ్లో శ్రేణి పై దృష్టి సారించి ప్రారంభించింది. చెక్క మరియు లోహపు ఉపరితలాల కోసం జెర్మ్‌ బ్లాక్‌ జెడ్‌ఎన్‌2+అయాన్‌ సాంకేతికత కలిగిన భారతదేశపు మొట్టమొదటి వాటర్‌ బేస్డ్‌ పెయింట్స్‌ జెఎస్‌డబ్ల్యు పెయింట్స్‌ ఆక్వాగ్లో. గతంలో భారతీయ వినియోగదారులు సాల్వెంట్‌ ఆధారిత ఎనామిల్స్‌ను వీటి కోసం వినియోగించే వారు. వీటిని ఆయిల్‌ కలర్స్‌ అనేవారు. చెక్క మరియు లోహపు  ఉపరితలాల పెయింటింగ్‌ కోసం వీటిని వాడుతుండేవారు.

 
ఈ తరహా రంగులలో రసాయనాలు మరియు ఇతర సాల్వెంట్స్‌ ఉండటంతో పాటుగా ఘాటైన వాసనలు కలిగి అత్యధిక వీఓసీ (వోలటైల్‌ ఆర్గానిక్‌ కంటెంట్‌)కూడా కలిగి ఉంటుంది. ఫలితంగా ఈ రంగులు చిన్నారులకు సూచనీయం కాదు. అలాగే అనారోగ్య పరిస్థితులలో ఉన్న వారికి కూడా సూచనీయం కాదు. ఈ సాల్వెంట్స్‌ ఇంటిని కలుషితం చేయడం తో పాటుగా వాడిన తరువాత ఇంటిలో అనారోగ్యకరమైన వాసనలు వెదజల్లుతాయి. ఈ తరహా రంగులు ఆరడానికి ఎక్కువ సమయం పట్టడంతో పాటుగా ఇంటిలోని వారికి అసౌకర్యమూ కలిగిస్తూ ఒకటి లేదా రెండు వారాలు వాసనలు వెదజల్లుతాయి. మరోవైపు,  జెఎస్‌డబ్ల్యు పెయింట్స్‌ ఆక్వాగ్లో 100% వాటర్‌ బేస్డ్‌ కలర్‌ కావడంతో పాటుగా అతి తక్కువ చెడు వాసనలు కలిగి ఉండి, వేగంగా పొడి బారుతుంది. ఇది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. వేగవంతంగా పొడి బారే ప్రయోజనం కారణంగా, పెయింటింగ్‌ అతి త్వరగా పూర్తి చేసే అవకాశం కూడా కల్పిస్తుంది. అలాగే సుదీర్ఘకాలం పాటు ప్రకాశవంతంగానూ ఉంటుంది.
 
ఆక్వాగ్లో ప్రచారం, ఇప్పుడు వినియోగదారుల సమగ్ర ఆరోగ్యంపై దృష్టి సారిస్తుంది. దానితో పాటుగా వారి సంక్షేమంపై దృష్టి సారిస్తూ బాలీవుడ్‌ నటి, జెఎస్‌డబ్ల్యు బ్రాండ్‌ అంబాసిడర్‌ అలియా భట్‌ ద్వారా ఓ ప్రచారం నిర్వహిస్తోంది. ఆమె వినియోగదారులను ‘పయింట్‌ కా జీకె బదావో’అంటూ కోరుతుంది. ఈ ప్రచారంలో సుప్రసిద్ధ ఆర్టిస్ట్‌,  స్టాండప్‌ కమెడియన్‌ అతుల్‌ ఖత్రీ కూడా కనిపించడంతో  పాటుగా ఎలాంటి నూతన ఆలోచన అయినా మాస్‌ హిస్టీరియాను జీవితానికి తీసుకువస్తారు.  సాల్వెంట్‌ ఆధారిత పెయింట్‌ను అలియా ఇంటిలో నూతనంగా రంగు కోసం వినియోగించడం, ఆ వాసనలు భరించడానికి అలియా ఇబ్బంది పడటం సోషల్‌ మీడియాలో సునామీలా మారుతుంది.
 
ప్రతి ఒక్కరూ ఆమెను చేసి నవ్వడంతో పాటుగా ఆయిల్‌ పెయింట్స్‌ వల్ల కాలుష్యం ఏర్పడుతుందనే అలియా వాదనను తప్పుగా అర్ధం చేసుకుంటారు. ఇది వినియోగదారుల నడుమ అతి తక్కువ స్ధాయిలో ఉన్న అవగాహన ఎత్తి చూపడంతో పాటుగా చెక్క మరియు లోహాల కోసం నీటి ఆధారిత రంగుల వినియోగపు ప్రయోజనాలు వెల్లడిస్తారు. భారతదేశంలో జెర్మ్‌ బ్లాక్‌ కలిగిన మొట్టమొదటి ఉడ్‌, మెటల్‌ పెయింట్‌ ఆక్వాగ్లో. ఇది కుటుంబానికి సురక్షితంగా ఉంటుంది. ఈ క్యాంపెయిన్‌ను భారతదేశ వ్యాప్తంగా సుప్రసిద్ధ టీవీ ఛానెల్స్‌, డిస్నీ+హాట్‌స్టార్‌ స్ట్రీమింగ్‌  వేదికలపై ప్రసారం కానుంది. ఈ ప్రచార నేపథ్యీకరణను టీబీడబ్ల్యుఏ/ఇండియా చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆటోలో ప్రముఖ నటి: పోలీసు అసభ్య ప్రవర్తన